ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చైనా దుశ్చర్యలపై వీఘర్ మహిళల పోరాటానికి మద్దతివ్వండి’

ABN, First Publish Date - 2021-03-08T00:36:37+05:30

వీఘర్ మహిళల అణచివేతకు వ్యతిరేకంగా చైనా ప్రభుత్వంపై పోరాటానికి మద్దతివ్వాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : వీఘర్ మహిళల అణచివేతకు వ్యతిరేకంగా చైనా ప్రభుత్వంపై పోరాటానికి మద్దతివ్వాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలను ఉద్యమకారులు కోరారు. చైనాలోని జింజియాంగ్‌లో వీఘర్ మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, తీవ్రమైన అణచివేత కొనసాగుతోందని, ఈ దురాగతాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని కోరారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. 


ఈ బహిరంగ లేఖపై కజఖ్ క్యాంప్ సర్వైవర్ మిహ్రిగుల్ టుర్సున్, వీఘర్ క్యాంప్ సర్వైవర్ కెల్బినూర్ సిదిక్, ఉజ్బెక్ క్యాంప్ సర్వైవర్ సైరాగుల్ సౌట్బే, కజఖ్ క్యాంప్ సర్వైవర్ టుర్సునే జియావుదున్, మరికొందరు సంతకాలు చేశారు. 


ఈ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, ‘డబుల్ రిలెటివ్స్’ ప్రోగ్రామ్‌ను చైనా ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని ప్రకారం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు వీఘర్ ముస్లింల ఇళ్లలోకి ప్రవేశించి, ఆ కుటుంబాలను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.  వీఘర్ మహిళల భర్తలు కాన్సంట్రేషన్ క్యాంపులలో కానీ, జైళ్ళలో కానీ ఉంటున్నారు. ఇటువంటి మహిళల్లో అత్యధికుల ఇళ్లలోకి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రవేశిస్తున్నారు. దీంతో మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు జరుగుతున్నాయి. ఇది అత్యంత అవమానకరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. వీఘర్, కజఖ్ మహిళలు ఇటువంటి దారుణాలను చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్నారు. తూర్పు టర్కీలో చైనా ప్రభుత్వం నరమేధం విధానాలను అవలంబిస్తోంది. హాన్ చైనీస్ పురుషులను పెళ్లి చేసుకునేవిధంగా వీఘర్ ముస్లిం మహిళలను నిర్బంధిస్తున్నారు. 


ఈ దురాగతాలను సాహసోపేతంగా బయటపెడుతున్న మహిళలకు అంతర్జాతీయ సమాజం మద్దతుగా నిలవాలని ఈ లేఖ కోరింది. తూర్పు టర్కిస్థాన్‌లోని వీఘర్, టర్కీ మహిళల హక్కులను ప్రతి రోజూ చైనా ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తెలిపింది. ఆ మహిళల శరీరాలు, కార్మిక హక్కులు, కుటుంబ జీవితాలపై చైనా ప్రభుత్వం గట్టి నియంత్రణను సాధించిందని తెలిపింది. 


2021 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాధిత మహిళలకు అండగా నిలవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఈ ఉద్యమకారులు కోరారు. మహిళా సంఘాలు, ఫెమినిస్ట్‌లు చైనా ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా గళమెత్తాలని కోరారు. 


Updated Date - 2021-03-08T00:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising