ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ Acb పంజా.. మాజీ మంత్రికి చెందిన 4 ప్రాంతాల్లో సోదాలు

ABN, First Publish Date - 2021-10-23T13:04:50+05:30

గత ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేసిన విజయభాస్కర్‌కు చెందిన నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మరోమారు శుక్రవారం సోదాలు చేశారు. మాజీ ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ సహా ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(Chennai): గత ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేసిన విజయభాస్కర్‌కు చెందిన నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మరోమారు శుక్రవారం సోదాలు చేశారు. మాజీ ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ సహా ఆయన అనుచరులు, బంధువులు, స్నేహితుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు గతంలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.23.85 లక్షల నగదు, 4.87 కిలోల బంగారం ఆభరణాలు, 136 భారీ వాహనాల రిజిస్ట్రేషన్‌ పత్రాలు, 19 కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి విచారణకు మాజీ మంత్రి సహకరించకపోవడంతో తాజాగా మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేశారు. చెన్నై నందనంలోని శరవణన్‌ అనే వ్యక్తి నివాసం, థౌజండ్‌లైట్‌లో ఉన్న శాంసన్‌ డెవలపర్స్‌, అన్నానగర్‌లోని విజయభాస్కర్‌ సహాయకుడు మురుగన్‌ నివాసం, సేలం ధరణ్‌ ఆస్పత్రి వైద్యుడు సెల్వరాజి నివాసాల్లో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సిఉంది. 

Updated Date - 2021-10-23T13:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising