ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమార్జన కేసులో Acb ఎదుట మాజీ మంత్రి హాజరు

ABN, First Publish Date - 2021-10-26T15:24:57+05:30

అక్రమార్జన కేసులో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ సోమ వారం ఉదయం ఏసీబీ అధికారుల విచారణకు హజరయ్యారు. విజయభాస్కర్‌ అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. గత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై(Tamilnadu): అక్రమార్జన కేసులో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ సోమ వారం ఉదయం ఏసీబీ అధికారుల విచారణకు హజరయ్యారు. విజయభాస్కర్‌ అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. గత జూలైలో ఎంఆర్‌ విజయభాస్కర్‌ నివాసగృహాలు, బంధువులు, స్నేహితుల నివాసగృహాలు సహా 21 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. ఆ తనిఖీలలో అక్రమార్జనలకు సంబంధించి కీలకమైన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 30 తమ విచారణకు రమ్మంటూ ఏసీబీ అధికారులు సమన్‌ జారీ చేసినా విజయభాస్కర్‌ హాజరుకాలేదు. దీనితో అక్టోబరు 25న విచారణకు హాజరుకావాలని రెండోమారు ఏసీబీ అధికారులు ఆయనకు సమన్‌ జారీ చేశారు. ఆ మేరకు స్థానిక ఆలందూరు వద్దనున్న ఏసీబీ కార్యాలయానికి ఎంఆర్‌ విజయభాస్కర్‌ సోమవారం ఉదయం వెళ్ళారు. ఆ సందర్భంగా ఏసీబీ అధికారులు అక్రమార్జనలకు సంబంధించిన వివరాలపై ఆయనను ప్రశ్నించారు. తమ తనిఖీలలో పట్టుబడిన నగదుకు సంబంధించి కూడా అధికారులు ఆయన వద్ద విచారణ జరిపారు. సుమారు గంటకు పైగా ఈ విచారణ కొనసాగింది. విచారణ తర్వాత విజయభాస్కర్‌ కారెక్కి తన నివాసానికి బయల్దేరారు.

Updated Date - 2021-10-26T15:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising