ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మహా’ పంచాయతీ ఎన్నికల్లో 70 స్థానాలు గెలుచుకున్న ఆప్!

ABN, First Publish Date - 2021-01-20T00:58:31+05:30

మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ అనూహ్యంగా 70 స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవల జరిగిన పంచాయతీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ అనూహ్యంగా 70 స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడగా.. 13 జిల్లాల్లో తమ కార్యకర్తలు విజయం సాధించారని ఆప్ ప్రకటించింది. జనవరి 15న జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు 300 మంది తమ పార్టీ మద్దతుతో పోటీ చేశారని ఆప్ పేర్కొంది. లాతూర్, నాగ్‌పూర్, సోలాపూర్, నాశిక్, గోండియా, చందరాపూర్, పాల్గఢ్, హింగోలీ, అహ్మద్‌నగర్, జల్నా, యవాత్మాల్, భందరా జిల్లాలు సహా 13 జిల్లాల్లోని గ్రామ పంచాయతీల్లో తమ పార్టీ విజయం సాధించినట్టు ఆప్ తెలిపింది. ‘‘ప్రత్యేకించి ఆమాద్మీ పార్టీ స్థానాల సంఖ్య పెరగడానికి మహిళల విజయాలే కారణం. 50 శాతం స్థానాలకు పైగా మహిళలే విజయం సాధించారు...’’ అని ఆప్ ఓ ప్రకటనలో పేర్కొంది. జనవరి 15న మొత్తం 12,711 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా... దాదాపు 1.25 లక్షల మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీ గుర్తులపై జరక్కపోయినప్పటికీ.. ఆయా పార్టీలు, స్థానిక నేతల మద్దతుతోనే అధికశాతం అభ్యర్థులు బరిలో నిలిచారు. 

Updated Date - 2021-01-20T00:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising