ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిన్ యాప్‌లో పేరు నమోదు.. కేంద్రం కీలక ప్రకటన!

ABN, First Publish Date - 2021-02-06T23:36:57+05:30

కరోనా టీకా కోసం కొవిన్ యాప్‌లో పేరు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డ్ తప్పనిసరేమీకాదని కేంద్రం తాజాగా తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం కొవిన్ యాప్‌లో పేరు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డ్ తప్పనిసరేమీకాదని కేంద్రం తాజాగా తెలిపింది. కేంద్రం ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్వినీ చౌబే లోక్‌సభలో శుక్రవారం నాడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ యాప్ కోసం కేంద్రం ఫిబ్రవరి 1వరకూ రూ. 58.90 లక్షలను ఖర్చు చేసిందన్నారు. కరోనా టీకా పంపిణీ వ్యవహారాలన్నీ సమన్వయ పరిచేందుకు కేంద్రం కొవిన్ వెబ్ పోర్టల్‌ను, యాప్‌ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. కరోనా టీకాను వేసుకోదలచిన వారు ముందుగా ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూఎన్‌డీపీ సహకారంతో కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ యాప్‌ను రూపొందించింది. కాగా.. కొవిన్ యాప్‌లో పేరు నమోదుకు ఆధార్ అవసరమా అని  లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి చౌబే ఈ మేరకు సమాధానం చెప్పారు. సమాచార భద్రత దృష్ట్యా కొవిన్‌లో నమోదైన డాటా అంతా అత్యంత పటిష్టమైన కీ ద్వారా ఎన్‌క్రిప్ట్ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రైవెసీకి సంబంధించి జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్‌లోని విధివిధానాలను కొవిన్ ప్లాట్‌ఫామ్‌లో అమలవుతున్నాయని చౌబే లోక్‌సభకు తెలిపారు. 

Updated Date - 2021-02-06T23:36:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising