ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటర్‌ ఐడీతో ఆధార్‌ లింకు!

ABN, First Publish Date - 2021-08-06T07:56:44+05:30

బోగస్‌ ఓటర్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) ప్రతిపాదించిన ఓటర్‌ కార్డు-ఆధార్‌ అనుసంధానం ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదనలపై కసరత్తు: కిరెణ్‌ రిజిజు

న్యూఢిల్లీ, ఆగస్టు 5: బోగస్‌ ఓటర్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) ప్రతిపాదించిన ఓటర్‌ కార్డు-ఆధార్‌ అనుసంధానం ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు వెల్లడించారు. ఆ ప్రతిపాదనలపై ఇప్పటికే భారత లా కమిషన్‌ పరిశీలన పూర్తయిందని వివరించారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని బుధవారం లోక్‌సభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాజ్దా అహ్మద్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఈసీ ప్రతిపాదించిందని తెలిపారు. 


జమిలి ఎన్నికలతో వ్యయభారం తగ్గుతుంది

జమిలీ ఎన్నికలకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసిందని మరో ఎంపీ ప్రదీ్‌పకుమార్‌ సింగ్‌ అడిగిన ఓ ప్రశ్నకు కిరెణ్‌ రిజిజు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,814 కోట్ల నిధులను విడుదల చేసిందని వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు జరిగే జమిలీ ఎన్నికలతో ఆ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలకు పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసిందని మరో ఎంపీ ప్రదీ్‌పకుమార్‌ సింగ్‌ అడిగిన ఓ ప్రశ్నకు కిరెణ్‌ రిజిజు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,814 కోట్ల నిధులను విడుదల చేసిందని వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు జరిగే జమిలీ ఎన్నికలతో ఆ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-06T07:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising