ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తొమ్మిది’ మార్కుల ఆధారంగా పాలిటెక్నిక్‌ అడ్మిషన్లు

ABN, First Publish Date - 2021-06-13T17:07:54+05:30

తొమ్మిదో తరగతి మార్కుల ఆధారంగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు చేపట్టను న్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా గ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

              - మంత్రి పొన్ముడి


చెన్నై: తొమ్మిదో తరగతి మార్కుల ఆధారంగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా గత విద్యా సంవత్సరం అన్ని పబ్లిక్‌ పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో, ప్రస్తుత విద్యా సంవత్సరం కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి శనివారం సచివాలయంలో మంత్రి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... కరోనా కారణంగా ఈ ఏడాది 11వ తరగతిలో విద్యార్థుల అడ్మిషన్లకు చేపట్టనున్న విధంగానే పాలిటెక్నిక్‌ కళాశాల అడ్మిషన్లు కూడా వుంటాయన్నారు. ఆ ప్రకారం, విద్యార్థులు 9వ తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. అన్నా విశ్వవిద్యాల యంలో నిర్వహించినట్టే పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇంజనీరింగ్‌, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల్లో ఏ ప్రాతిపదికన విద్యార్థుల అడ్మిషన్లు చేపట్టాలనే విషయంపై చర్చిస్తున్నామని, అనంతరం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సేలంలోని పెరి యార్‌ విశ్వవిద్యాలయం, కామరాజర్‌ విశ్వవిద్యాలయం, అన్నామలై విశ్వవిద్యాలయం తదితర మూడు విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీలో అవినీతి జరిగినట్టు ఆరోపణలున్నాయన్నారు. ఈ వ్యవ హారంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో చర్చించి ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటుచేసి విచారణ చేపడతామని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-06-13T17:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising