ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోమియో మందు వికటించి.. 9 మంది మృతి

ABN, First Publish Date - 2021-05-07T07:35:12+05:30

ఛత్తీ్‌సగఢ్‌లో మద్యానికి బదులు సేవించిన హోమియో మందు వికటించి ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని బలి తీసుకుంది. బిలా్‌సపూర్‌ జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  మద్యానికి బదులు డ్రోసెరా-30 సేవించిన బాధితులు

బిలా‌స్‌పూర్‌, మే 6: ఛత్తీ్‌సగఢ్‌లో మద్యానికి బదులు సేవించిన హోమియో మందు వికటించి ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని బలి తీసుకుంది. బిలా్‌సపూర్‌ జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిగిట్టి పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోర్మి గ్రామానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు హోమియోపతి వైద్యుడి సూచన మేరకు మద్యానికి బదులు 91ు నాటుసారా కలిగిన డ్రోసెరా-30 అనే సిరప్‌ సేవించారు. గొంతు నొప్పి, దగ్గు, శ్వాసకోశ సమస్యలు, కీళ్ల నొప్పుల నివారణకు వినియోగించే ఈ ఔషధాన్ని బాధితులు మోతాదుకు మించి తీసుకున్నారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం రాత్రి నలుగురు, బుధవారం మరొకరు ఇంటి వద్దే చనిపోయారు. మరో నలుగురు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. వీరంతా కొవిడ్‌తో చనిపోయారని భావించిన కుటుంబ సభ్యులు రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు అదే ఔషధం సేవించి అస్వస్థతకు గురైన మరో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఔషధం ఇచ్చిన వైద్యుడు పరారీలో ఉన్నాడు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు మిగిలిన గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హోమియో మందు వికటించడం వల్లే బాధితులు చనిపోయారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, పోస్టు మార్టం రిపోర్టులో వాస్తవాలు తెలుస్తాయని బిలా్‌సపూర్‌ జిల్లా ఎస్పీ ప్రశాంత్‌ అగర్వాల్‌ చెప్పారు.

Updated Date - 2021-05-07T07:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising