ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

75 ఏళ్ల స్వాతంత్ర్యం... 75 'వందే భారత్ రైళ్లు'

ABN, First Publish Date - 2021-08-15T23:15:28+05:30

న్యూఢిల్లీ: ''ఆజాదీ కా అమృత్ మహోత్సవ్''లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ 75 వారాల్లో 75 ''వందే భారత్'' రైళ్లు అందాబాటులోకి రానున్నట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ''ఆజాదీ కా అమృత్ మహోత్సవ్''లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ 75 వారాల్లో 75 ''వందే భారత్'' రైళ్లు అందాబాటులోకి రానున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 75వ స్వాతంత్ర్య వేడుకలు సందర్భంగా ఆదివారంనాడు దేశప్రజలను ఉద్దేశించి ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.


స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు ప్రస్తుతం కాన్పూర్-ప్రయాగ్ రాజ్ మీదుగా ఢిల్లీ-వారణాసి మార్గంలో, మరొకటి ఢిల్లీ కాట్రా మార్గంలో నడుస్తున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022 ఆగస్టు నాటికి 75 ఏళ్లు అవుతుంది. అప్పటికి 40 నగరాలను కలుపుతూ 10 సెమీ-హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని భారతీయ రైల్వే భావిస్తోంది. 2024 నాటికి 100 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించాలని భారత రైల్వే లక్ష్యంగా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఈ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. పూర్తిగా ఆటోమెటిక్ డోర్లు, ఏసీ కోచ్‌లు, రివాల్వింగ్ చైర్లు, బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, సీసీటీవీ కెమెరాలు, వైఫే యాక్సిస్, ఇతర హైటెక్ ఫీచర్స్, భోజన సదుపాయాలు ఉంటాయి.


ఈశాన్య ప్రాంతాల్లో రైల్ కనెక్టిటివీ...

కాగా, ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈశాన్య ప్రాంతాల్లో రైళ్లు అనుసంధానం మరింత పెంచుతామని ప్రకటించారు. ప్రస్తుతం సిక్కిం మినహా, అన్ని ఈశాన్య రాష్ట్రాలకూ రైల్ కనెక్టివిటీ ఉంది. అసోం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నగరాలకు కనెక్టివిటీ కల్పించారు. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ రాజధాని నగరాల కనెక్టివిటీ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో జాప్యమవుతూ వస్తున్న ఈ పనులు 2024 నాటికి పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2021-08-15T23:15:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising