ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటి మోతాదు ఒకటి.. రెండోది మరొకటి!

ABN, First Publish Date - 2021-05-14T07:22:01+05:30

72ఏళ్ల వృద్ధుడికి రెండు వేర్వేరు కంపెనీల తయారీ కరోనా టీకాలను వేశారు. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడు ఆ బాధితుడి పరిస్థితి ఏమిటో?


ముంబై, మే 13: 72ఏళ్ల వృద్ధుడికి రెండు వేర్వేరు కంపెనీల తయారీ కరోనా టీకాలను వేశారు. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన దత్తాత్రే య వాఘ్మారేకు మొదటి మోతాదు మార్చి 22న భారత్‌ బయోటెక్‌ తయారీ కొవాగ్జిన్‌ను ఒక పీహెచ్‌సీలో ఇచ్చారు. అయితే, ఆయన రెండో మో తాదు కోసం ఏప్రిల్‌ 30న మరో పీహెచ్‌సీకి వెళ్లగా.. సీరం ఇనిస్టిట్యూట్‌ తయారీ కొవిషీల్డ్‌ను ఇచ్చారు. ఆ తర్వాత.. తన తండ్రికి జ్వరం, శరీరంపై అక్కడక్కడా దద్దుర్లు వచ్చాయని దిగంబర్‌ చెప్పారు. తన తండ్రి నిరక్షరాస్యుడని.. ఆస్పత్రుల్లో సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగని ఆయన వాపోయారు. కాగా, రెండు రకాల టీకాలను ఎక్కిస్తే అలసట, తలనొప్పి వంటి దుష్ఫ్రభావాలు ఉంటాయని, ఈ టీకాల మిశ్రమం వలన ఎంతవరకూ రక్షణ ఉంటుందో ఇప్పటి వరకూ గుర్తించలేదని మెడికల్‌ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితం కావడం గమనార్హం.

Updated Date - 2021-05-14T07:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising