ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసోం, మిజోరాం సరిహద్దుల్లో ఘర్షణ: ఆరుగురు పోలీసుల దుర్మరణం

ABN, First Publish Date - 2021-07-27T01:39:10+05:30

అసోం, మిజోరాం సరిహద్దుల్లో చెలరేగిన ఉద్రిక్తత చిలికి చిలికి గాలివానలా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దుల్లో చెలరేగిన అల్లర్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :  అసోం, మిజోరాం సరిహద్దుల్లో చెలరేగిన ఉద్రిక్తత చిలికి చిలికి గాలివానలా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దుల్లో చెలరేగిన అల్లర్లలో అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అసోం, మిజోరం సరిహద్దుల్లో చెలరేగిన అల్లర్లలో అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన చాలా బాధించింది. ఆ కుటుంబాలకు నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను’’ అంటూ సీఎం హిమంత బిశ్వశర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అసోం, మిజోరాం సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. అసోంలోని కచార్ జిల్లాలో, మిజోరాంలోని కోలాసిబ్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయని, ప్రభుత్వ వాహనాలపై దాడులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండు రోజుల పాటు అసోంలో పర్యటించారు. తిరిగి ఢిల్లీకి చేరుకోగానే ఈ అల్లర్లు జరిగాయి. అయితే అల్లర్ల విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. 

Updated Date - 2021-07-27T01:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising