ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో.. ఐదురోజుల్లో 117 మంది మృతి

ABN, First Publish Date - 2021-05-09T18:04:08+05:30

కృష్ణగిరి జిల్లాలో 5వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు సుమారుగా 117 మంది మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణగిరి ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



కృష్ణగిరి(కర్ణాటక): కృష్ణగిరి జిల్లాలో 5వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు సుమారుగా 117 మంది మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో 7వ తేదీ 25మంది మృతిచెందారు. అందులో ముగ్గురు కరోనాతోనూ, 13 మంది కరోనా నయమై డిశ్చార్జ్‌ అయి 15 రోజుల్లో మళ్లీ అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చి మృతిచెందారు. అదేవిధంగా 9 మంది జ్వరం, తలనొప్పి, చలి కారణంగా మృతి చెందారు. వారికి కరోనా లక్షనాలున్నాయని, వైద్యులు ధృవీకరించారు. అదేవిధంగా 6వ తేదీ 34 మంది, 5వ తేదీ 22 మంది, 4వతేదీ 14 మంది, 6వ తేది 22 మంది మృతి చెందినట్టు తెలి పారు. కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా పెద్దసంఖ్యలో కరోనా వల్ల, కరోనా లక్షణాలున్న 117 మంది మృతిచెందడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురయ్యారు. 


Updated Date - 2021-05-09T18:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising