ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

520 మంది మైగ్రెంట్లకు ఉద్యోగాలు: కేంద్రం

ABN, First Publish Date - 2021-08-11T22:42:47+05:30

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత 520 మంది మైగ్రెంట్ వర్కర్లు జమ్మూకశ్మీర్‌కు తిరిగి వచ్చినట్టు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ప్రైమ్‌మినిస్టర్ డవలప్‌మెంట్ ప్యాకేజీ-2015 కింద 520 మంది మైగ్రెంట్లకు ఉద్యోగాలు వచ్చాయని బుధవారంనాడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు 370 అధికరణ రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం వెనక్కి తిరిగి వచ్చిన 520 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు.


కశ్మీరీ మైగ్రెంట్ వర్కర్లకు ఫ్లాట్ల నిర్మాణం కోసం వివిధ జిల్లాల్లోని 278 కెనాల్ ల్యాండ్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు గత నెలలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సారథ్యంలోని జమ్మూకశ్మీర్ యంత్రాంగం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద జమ్మూకశ్మీర్‌లో 2,500 మందికి పైగా మైగ్రెంట్ వర్కర్లకు వసతి కల్పించనున్నారు. వరద సహాయం, పునర్నిర్మాణం, ఫ్లడ్ మేనేజిమెంట్ వంటి పలు కీలక ప్రాజెక్టుల కోసం అప్పటి జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి 2015లో రూ.80,000 కోట్లను ప్రధాని మోదీ ప్రకటించారు. 2019 ఆగస్టు 5న 370వ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

Updated Date - 2021-08-11T22:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising