ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జార్కిహోళి రాసలీల సీడీ.. 5 కోట్ల ఒప్పందం

ABN, First Publish Date - 2021-03-06T08:16:07+05:30

కర్ణాటక రాజకీయాలలో దుమారం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీల సీడీ వెనుక రూ. 5కోట్ల ఒప్పందం జరిగిందని, దీనికి సంబంధించిన సమాచారం ఉందని మాజీ సీఎం కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3 నెలల క్రితమే బ్లాక్‌మెయిల్‌ చేశారు

దీని సమాచారం నా దగ్గరుంది: కుమారస్వామి 


బెంగళూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాజకీయాలలో దుమారం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీల సీడీ వెనుక రూ. 5కోట్ల  ఒప్పందం జరిగిందని, దీనికి సంబంధించిన సమాచారం ఉందని మాజీ సీఎం కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మైసూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలుత సీడీ గురించి మాట్లాడే వ్యక్తిని అరెస్టు చేయాలన్నారు. ఇంకా తన వద్ద సీడీలు ఉన్నాయని ప్రకటించడం వెనుక బ్లాక్‌మెయిల్‌ కనిపిస్తోందన్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాన్నైనా ఈ విధంగా చూపడం తప్పని అన్నారు. తనకున్న సమాచారం ప్రకారం మూడు నెలల కిందటే సీడీ చూపి బ్లాక్‌మెయుల్‌ చేశారని చెప్పారు. దీని వెనుక బడా నేతల హస్తముందని మరో బాంబు పేల్చారు. సమాజంలో విసుగుపుట్టించే పరిస్థితి నెలకొందని కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. ఒక మాజీ సీఎం ఎక్కడికెక్కడో వెళ్లివస్తారని.. సదరు సీడీ కూడా తన వద్ద ఉందని చెబుతున్నారని, అదెవరిదో చెబితే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో దేవేగౌడ, ఎస్‌ఎం కృష్ణ కాలం నుంచి ఎంతోమంది సీఎంలుగా పనిచేశారని, ప్రజా జీవితంలో వారిని అనుమానంతో చూసే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. 

Updated Date - 2021-03-06T08:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising