ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగ్రవాద ప్రేరేపిత దాడుల్లో 40 మంది పౌరుల మరణం: కేంద్రం

ABN, First Publish Date - 2021-11-30T22:16:12+05:30

ఉగ్రవాద ప్రేరేపిత దాడుల నుంచి పౌరులను కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, రానున్న కాలంలో పౌరులకు మరింత రక్షణ కల్పిస్తామని నిత్యానంద్ అన్నారు. ఉగ్రవాదులను ఉగ్ర కార్యకలాపాలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఈ యేడాది జరిగిన ఉగ్రవాద ప్రేరేపిత దాడుల్లో 40 మంది పౌరులు మరణించారని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల వివరాలను తెలియజేశారు. ‘‘ఈ ఏడాది నవంబర్ 15 వరకు జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద ప్రేరేపిత దాడుల్లో 40 మంది పౌరులు మరణించారు. అలాగే మరో 75 మంది గాయపడ్డారు. వీరితో పాటు 35 మంది సైనికులు చనిపోగా, 86 మంది గాయపడ్డారు’’ అని లోక్‌సభలో నిత్యానంద్ పేర్కొన్నారు.


ఉగ్రవాద ప్రేరేపిత దాడుల నుంచి పౌరులను కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని, రానున్న కాలంలో పౌరులకు మరింత రక్షణ కల్పిస్తామని నిత్యానంద్ అన్నారు. ఉగ్రవాదులను ఉగ్ర కార్యకలాపాలను నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-11-30T22:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising