ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాలపై మొబైల్ ఫోన్‌లో బిజీ... నలుగురిపై నుంచి దూసుకెళ్లిన రైలు

ABN, First Publish Date - 2021-08-23T22:54:15+05:30

ఈ విషయమై ఇస్లాంపూర్ ఎస్పీ సచిన్ మక్కర్ మాట్లాడుతూ ‘‘నలుగురు మైనర్ బాలురు రైలు ప్రమాదంలో చనిపోయారు. ఆదివారం రాత్రి వారు రైలు పట్టాలపై కూర్చొని మొబైల్ ఫోన్ చూస్తూ రైలును గమనించలేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ అనివార్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాకపోతే అజాగ్రత్తగా ఉంటే ఈ ఫోనే ఉరితాడు అవుతోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఘటన దీనికి మరో ఉదాహరణ. రైలు పట్టాలపై కూర్చుని ఏదీ పట్టించుకోని స్థితిలో మొబైల్ ఫోన్లో మునిగిపోయిన ఓ నలుగురు యువకులపై నుంచి రైలు దూసుకెళ్లింది. దీంతో వాళ్లకు అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా 13-14 ఏళ్ల మధ్య వయసున్న వారే. రాష్ట్రంలోని ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లా ఇస్లాంపూర్‌లో ఆదివారం జరిగిందీ ఘోరం.


ఈ విషయమై ఇస్లాంపూర్ ఎస్పీ సచిన్ మక్కర్ మాట్లాడుతూ ‘‘నలుగురు మైనర్ బాలురు రైలు ప్రమాదంలో చనిపోయారు. ఆదివారం రాత్రి వారు రైలు పట్టాలపై కూర్చొని మొబైల్ ఫోన్ చూస్తూ రైలును గమనించలేదు. దీంతో రైలు వారిని చిదిమేసింది. నలుగురు మృతదేహాల్ని ఖననం చేశారు. అయితే ఈ విషయమై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విషయం తెలుసుకున్న అనంతరం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి చెల్లా చెదురైన మొబైల్ ఫోన్ల విడిభాగాలు లభించాయి’’ అని పేర్కొన్నారు. తమకు ఫిర్యాదు అందితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ఎస్పీ సచిన్ తెలిపారు.

Updated Date - 2021-08-23T22:54:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising