ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 దిగువకు పాజిటివ్‌ రేటు

ABN, First Publish Date - 2021-06-20T09:05:20+05:30

దేశంలో కరోనా పాజిటివ్‌ రేటు 3 దిగువకు వచ్చింది. శుక్రవారం 19 లక్షల పరీక్షలు చేయగా 60,753 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వెల్లడైన ఫలితాల ప్రకారం.. పాజిటివ్‌ రేటు 2.98గా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో కరోనా కొత్త కేసులు 60 వేలు


న్యూఢిల్లీ, జూన్‌ 19: దేశంలో కరోనా పాజిటివ్‌ రేటు 3 దిగువకు వచ్చింది. శుక్రవారం 19 లక్షల పరీక్షలు చేయగా 60,753 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వెల్లడైన ఫలితాల ప్రకారం.. పాజిటివ్‌ రేటు 2.98గా నమోదైంది. వారపు పాజిటివ్‌ రేటు మరింత తగ్గి 3.58కి పడిపోయింది. మరో 1,647 మంది మృతి చెందారు. కొత్తగా 97 వేల మంది కోలుకున్నారు. వరుసగా 37వ రోజూ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉంది.  రికవరీ రేటు 96.16కు చేరింది. యాక్టివ్‌ కేసులు 7.60 లక్షలకు తగ్గాయి. గత 74 రోజుల్లో ఇవే అత్యల్పం. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పరిశ్రమలు- అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్‌ మహాపాత్ర (59) కరోనాతో మృతి చెందారు.


వైరస్‌ బారినపడిన ఈయన రెండు నెలలుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి శనివారం చనిపోయారు. కేంద్ర సర్వీసుల్లో ఉంటూ కరోనాతో మృతిచెందిన తొలి ఐఏఎస్‌ ఈయన. మహాపాత్ర 1986 గుజరాత్‌ కేడర్‌ అధికారి. ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు కలిసి పనిచేశారు. మహాపాత్ర మృతికి మోదీ, పలువురు కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-06-20T09:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising