ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనంగా ఏసీ బోగీలు

ABN, First Publish Date - 2021-08-04T12:38:39+05:30

స్థానిక ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ నుంచి దక్షిణాది ప్రాంతాలవైపు వెళ్ళే మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు కొత్తగా ఒక్కో ఏసీ బోగీని చేర్చినట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు. ఎగ్మూరు నుంచిమదురై, తిరుచ్చి వెళ్ళే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: స్థానిక ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ నుంచి దక్షిణాది ప్రాంతాలవైపు వెళ్ళే మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు కొత్తగా ఒక్కో ఏసీ బోగీని చేర్చినట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు. ఎగ్మూరు నుంచిమదురై, తిరుచ్చి వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఈ అదనపు ఏసీ బోగీ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. మదురై నుంచి ఎగ్మూరు వచ్చే మదురై స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (నెం.02638)కు ఉన్న సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌ను ఈ నెల 23న తొలగించి ఏసీ బోగీ బిగించనున్నట్లు తెలిపారు. చెన్నై నుంచి మదురై వెళ్లే (నెం.02637)రైలుకు ఉన్న సెకెండ్‌ క్లాస్‌ స్లీపర్‌ను ఈ నెల 26న తొలగించిన ఏసీ బోగీని అమర్చనున్నట్లు తెలిపారు. ఎగ్మూరు నుంచి తిరుచ్చికి వెళ్లే ప్రత్యేక రైలు (నెం: 06795)కు ఉన్న స్లీపర్‌ను ఈ నెల 24న తొలగించి ఏసీ బోగీని చేర్చి నడుపనున్నారు. ఇదే విధంగా తిరుచ్చి నుంచి ఎగ్మూరుకు వచ్చే ప్రత్యేక రైలు (నెం:06796) కు ఉన్న స్లీపర్‌ను ఈ నెల 26న తొలగించి ఏసీ బోగీని చేర్చి నడుపుతారు. తిరుచ్చి నుంచి ఎగ్మూరుకు, ఎగ్మూరు నుంచి తిరుచ్చికి వెళ్ళే ప్రత్యేక రైలు (నెం: 02654)కు ఉన్న స్లీపర్‌ను ఈ నెల 24న తొలగించి ఏసీ బోగీని కల్పిఇ నడుపుతారు. ఎగ్మూరు నుంచి తిరుచ్చి వెళ్లే ప్రత్యేక రైలు (నెం: 02653)కు ఉన్న స్లీపర్‌ను ఈ నెల 25న తొలగించి ఏసీ బోగీని బిగించి నడుపనున్నారు.

Updated Date - 2021-08-04T12:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising