ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రిపుర సీఎంపై హత్యాయత్నం, ముగ్గురి అరెస్ట్

ABN, First Publish Date - 2021-08-07T21:55:16+05:30

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌పై హత్యాయత్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌పై హత్యాయత్నం చేశారంటూ ముగ్గుర్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ వీథిలోని తన అధికారిక నివాసం నుంచి గురువారం ఆయన ఈవెనింగ్ వాక్‌కి వెళ్లినపుడు ఈ ముగ్గురూ సీఎం సెక్యూరిటీ వాహనాల్లోకి ఓ కారును నడిపారని పోలీసులు తెలిపారు. ఆ కారు వేగంగా దూసుకురావడాన్ని గమనించిన ముఖ్యమంత్రి ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారని చెప్పారు. ఈ సంఘటనలో భద్రతా సిబ్బందిలోని ఓ అధికారికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. ఆ కారును ఆపేందుకు సీఎం భద్రతా సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు ఓ కిలోమీటర్ ఛేజింగ్ తర్వాత ఆ కారును ఆపగలిగారు. TR01-0356 నంబరుగల ఈ కారులోని ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. కషరి పట్టి నివాసి శుభం సాహా (27), రామ్ ఠాకూర్ సంఘ నివాసి అమన్ సాహా (25), రవీంద్రపల్లి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న గైరిక్ ఘోష్ (24)గా వీరిని గుర్తించినట్లు చెప్పారు. 


ఈ నిందితులను ప్రశ్నించేందుకు రెండు రోజుల కస్టడీ కోరామని, అయితే వీరిని కోర్టు ఆగస్టు 19 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపించిందని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిద్యుత్ సూత్రధర్  తెలిపారు. వీరి చర్యకు కారణాలు ఇంకా వెల్లడి కాలేదన్నారు. 


Updated Date - 2021-08-07T21:55:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising