ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ జట్టులోకి 28 మంది!

ABN, First Publish Date - 2021-06-29T06:52:38+05:30

అతి త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగొచ్చునని విశ్వసనీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కేబినెట్‌ విస్తరణ
  • ఒక్క యూపీ నుంచే ఐదుగురికి అవకాశం
  • కాంగ్రెస్‌ మాజీ నేత సింధియా, వరుణ్‌కు చోటు
  • అతి త్వరలో విస్తరణకు ముహూర్తం
  • కొత్త టీమ్‌లో మాజీ సీఎంలు, రాష్ట్రాల చీఫ్‌లు
  • సంకీర్ణ పక్షాలకూ ఈసారి తగిన ప్రాధాన్యం
  • లోక్‌జనశక్తి నుంచి పశుపతి పారస్‌కే చాన్స్‌


న్యూఢిల్లీ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): అతి త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగొచ్చునని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ఇప్పటికే వివిధ మంత్రిత్వశాఖల సమీక్ష పూర్తి చేసి.. మార్పులు, చేర్పులకు సంబంధించి జాబితా రూపొందించారని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. కొత్తగా మంత్రివర్గంలో 28 మందికి స్థానం కల్పించనున్నట్టు సమాచారం. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ కుమారుడు వరుణ్‌గాంధీ తదితరుల పేర్లు జాబితాలో బలంగా వినిపిస్తున్నాయి.


పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందుగా చేపడుతున్న మంత్రివర్గ విస్తరణ కావడంతో, ఈసారి కేబినెట్‌ కూర్పు భారీగానే ఉండొచ్చునని భావిస్తున్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈనెల 30వ తేదీన ఢిల్లీ తిరిగివచ్చిన తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చునని ఆ నేత అభిప్రాయపడ్డారు. 2019లో మంత్రివర్గం ఏర్పా టు చేసిన తర్వాత ప్రధానమంత్రి విస్తరణకు పూనుకోవడం ఇదే మొదటి సారి. కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న రాంవిలాస్‌ పాశ్వాన్‌, సురేశ్‌ అంగడి మరణించారు. అనేక మంది మంత్రులు ప్రస్తుతం ఒకటికి మించి శాఖల్ని నిర్వహిస్తున్నారు. 




ఇది ఎన్నికల జట్టు..

మోదీ కెప్టెన్సీలో వచ్చే ఎన్నికల్లో ఈసారి ఐదు రాష్ట్రాలనూ కైవసం చేసుకోవాలని కమలదళం ఆరాటపడుతోంది. కేబినెట్‌ కోసం ఈదిశగానే కసరత్తు జరిగిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వర్గాల అంచనాను బట్టి, ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌ నుంచి అత్యధికంగా ఐదుగురికి కేబినెట్‌లో చోటు దక్కనుంది. వీరిలో బీజేపీ యూపీ అధ్యక్షుడు, సంకీర్ణ దళం అప్నాదళ్‌ నేత పేర్లు కూడా వినిపిస్తుండటం గమనార్హం.


 ఇక.. ఒడిసా, రాజస్థాన్‌ నుంచి ముగ్గురు చొప్పున, బెంగాల్‌, ఢిల్లీ నుంచి ఒకరు చొప్పున కేబినెట్‌లో చేరనున్నారు. బిహార్‌లో రాం విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు లోక్‌ జనశక్తి నేత చిరాగ్‌ పాశ్వాన్‌పై తిరుగుబాటు చేసిన ఆయన బాబాయి పశుపతి పరా్‌సకు బెర్త్‌ ఖరారయింది. ఇక్కడ సంకీర్ణ దళం జేడీయూ నుంచి ఇద్దరికి, బీజేపీ నుంచి ఒకరికి చాన్స్‌ ఇస్తున్నారు. ఇక.. కర్ణాటక, హరియానా, లద్ధాఖ్‌ (కేంద్ర పాలిత ప్రాంతం) నుంచి ఒకరు చొప్పున, గుజరాత్‌ నుంచి ఇద్దరిని చేర్చుకొంటున్నారు. 




జాబితాలో...?

1)కాంగ్రెస్‌ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా 2) బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ 3) అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ 4) మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే 5)భూపేందర్‌ యాదవ్‌ 6) కైలాశ్‌ విజయవర్గీయ ( ఈ ఇద్దరు బీజేపీ ప్రధాన కార్యదర్శులు) 7) మైనారిటీ నేత సయ్యద్‌ జాఫర్‌ ఇస్లాం 8) బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ 9) మేనకాగాంధీ కుమారుడు వరుణ్‌ గాంధీ, 10) అప్నాదళ్‌ నేత అనుప్రియపాటిల్‌ 11) మహారాజ్‌గంజ్‌ ఎంపీ పంకజ్‌ చౌధురి 12) రైల్వే మాజీ మంత్రి దినేశ్‌ త్రివేదీ, 13) వైజయంతీ పాండా 14) అశ్వనీ వైష్ణవ్‌ (ఈ ఇద్దరు ఒడిసా ఎంపీలు) 15)ఢిల్లీ ఎంపీ మీనాక్షీలేఖీ 16) రాజ్యసభ ఎంపీ అనీల్‌ జైన్‌ 17) సుమేధానంద సరస్వతి, 18) పీపీ చౌధురి 19) రాహుల్‌ కాశ్వాన్‌ ( ఈ ముగ్గురు రాజస్థాన్‌ నేతలు) 20) లోక్‌ జనశక్తి నేత పశుపతి పారస్‌ 21) ఆర్‌సీపీ సింగ్‌ 22)సంతోశ్‌ కుమార్‌ (ఈ ఇద్దరు జేడీయూ నేతలు) 23) కర్ణాటక ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ 24)గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ 25) అహ్మదాబాద్‌ వెస్ట్‌ ఎంపీ కిరీట్‌ సోలంకి 26) పహ్యానా ఎంపీ సునీతా దుగ్గల్‌ 27) లద్దాఖ్‌ ఎంపీ నంగ్యాల్‌ తదితరులు.




Updated Date - 2021-06-29T06:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising