ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక 24*7 టీకా

ABN, First Publish Date - 2021-03-04T06:50:01+05:30

టీకా వేయించుకోవడంపై ప్రస్తుతం ఉన్న కాల పరిమితిని కేంద్రం ఎత్తివేసింది. ఇకపై ప్రజలు తమ వీలును బట్టి 24గీ7.. రోజులో ఎప్పుడైనా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ప్రధాని మోదీ ప్రజల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ఉదయం 9- 5 గంటల వరకే

వ్యాక్సినేషన్‌ వేగవంతానికే ఈ నిర్ణయం

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడి

ఆర్మీ ఆస్పత్రిలో రాష్ట్రపతి కోవింద్‌కు టీకా


న్యూఢిల్లీ, మార్చి 3: టీకా వేయించుకోవడంపై ప్రస్తుతం ఉన్న కాల పరిమితిని కేంద్రం ఎత్తివేసింది. ఇకపై ప్రజలు తమ వీలును బట్టి 24గీ7.. రోజులో ఎప్పుడైనా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ప్రధాని మోదీ ప్రజల ఆరోగ్యానికి, వారి సమయానికి విలువనిస్తారని.. అందుకే, టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి ఎక్కువ మంది ప్రజలు టీకా వేయించుకునేందుకు వీలుగా కాలపరిమితిని ఎత్తివేస్తున్నామని బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. దేశంలో టీకా కార్యక్రమం మొదలైనప్పటి నుంచి.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే వ్యాక్సిన్‌ వేస్తున్న సంగతి తెలిసిందే.


ఆ పరిమితిని ఎత్తివేస్తున్నామని.. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా వ్యాక్సినేషన్‌ కొనసాగించాలని ఆస్పత్రులు భావిస్తే అందుకు అభ్యంతరం లేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మంగళవారమే తెలిపారు. ‘‘కొవిన్‌ 2.0లో 9-5 టైమ్‌ సెషన్స్‌ ఇక ఉండవు. ఆస్పత్రులకు ఆ సామర్థ్యం ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి సాయంత్రం 5 తర్వాత కూడా వ్యాక్సినేషన్‌ కొనసాగించవచ్చు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తెలిపాం’’ అని ఆయన వివరించారు. కాగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (75) బుధవారం ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రిసెర్చ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో టీకా తొలి డోసు వేయించుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

Updated Date - 2021-03-04T06:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising