ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్ తాజా సంచలనం 2/3 మోడల్ పని దినాలు

ABN, First Publish Date - 2021-10-23T01:24:41+05:30

ప్రస్తుతం గూగుల్‌లో ఐదు రోజుల పని దినాలు అమలులో ఉన్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీసు విషయాల్లో స్పష్టత లేదు. కాగా గూగుల్ ఉద్యోగుల కోసం 2/3 మోడల్‌ను సుందర్ పిచాయ్ ప్రతిపాదించారు. దీని ప్రకారం రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాల్సి ఉండగా, మూడు రోజులు ఇంటి నుంచి పని చేసుకోవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: కొవిడ్ కారణంగా ఉద్యోగుల పని విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ‘వర్క్ ఫ్రం హోం’ అనేదానికి విస్తృత ప్రచారం లభించింది. చాలా కార్యాలయాల్లో ఇది అమలు జరిగింది కూడా. అయితే కొవిడ్ ప్రభావం తగ్గుతున్నా కొద్ది ఉద్యోగుల పని విధానాన్ని నిర్ణయించడంలో అనేక యాజమాన్యాలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇటు వర్క్ ఫ్రం హోం ఇవ్వలేక, అటు ఆఫీసుల్లో పని చేయించుకునే వీలులేక సతమతమవుతున్నాయి. అయితే ఉద్యోగుల ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మెథడ్‌కు గూగుల్ కొత్త పరిష్కారాన్ని కనుగొంది. ఇది ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందనేది ఇప్పట్లో చెప్పలేమని, అయితే తప్పనిసరిగా ఆశాజనమైన ఫలితాలే వస్తాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు.


ప్రస్తుతం గూగుల్‌లో ఐదు రోజుల పని దినాలు అమలులో ఉన్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీసు విషయాల్లో స్పష్టత లేదు. కాగా గూగుల్ ఉద్యోగుల కోసం 2/3 మోడల్‌ను సుందర్ పిచాయ్ ప్రతిపాదించారు. దీని ప్రకారం రెండు రోజులు ఇంటి పని చేయాల్సి ఉండగా, మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేసుకోవచ్చు. కొవిడ్ కారణంగా ఏడాది నుంచి చాలా మంది ఉద్యోగులు రిమోట్ ఏరియాల్లో ఉన్న వారి ఇంటి నుంచి పని చేస్తున్నారని, ఇప్పుడు వారు ఆఫీసు వరకు వచ్చి పని చేయడం కష్టమనే కారణంతోనే ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చారట. అయితే ఇది ప్రస్తుతానికి అమెరికాలోనే అమలు చేయనున్నరని, అమెరికాలో ఫలితాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులకు వర్తింపజేయనున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.

Updated Date - 2021-10-23T01:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising