ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

ABN, First Publish Date - 2021-06-13T18:21:08+05:30

చెన్నై ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ నుంచి ఈనెల 16 నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎగ్మూరు, సెంట్రల్‌ రైల్వేస్టేషన్లలో రైలు సర్వీసుల సంఖ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చెన్నై: చెన్నై ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ నుంచి ఈనెల 16 నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎగ్మూరు, సెంట్రల్‌ రైల్వేస్టేషన్లలో రైలు సర్వీసుల సంఖ్యను బాగా తగ్గించారు. గత నెల పూర్తిగా లాక్‌డౌన్‌ అమలు చేయడంలతో పగటి సమయపు రైళ్లను రద్దు చేశారు. చెన్నై ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ నుంచి తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి తదితర కీలకమైన ప్రాంతాల్లో ముఖ్యమైన రైళ్లను మాత్రమే నడుపుతూ వచ్చారు. ఆ తర్వాత వైగై, పల్లవన్‌ పగటిపూట రైళ్లను నడిపారు. ఈ రైళ్లను 15వ తేదీ వరకు రద్దు చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 16 నుంచి నిలిపివేసిన రైళ్లను మళ్ళీ నడుపనున్నారు. తిరుచెందూరు ఎక్స్‌ప్రెస్‌, మన్నార్‌గుడి, రామేశ్వరం (ప్రధాన మార్గం), తిరుచ్చి (చోళన్‌) మదురై (తేజస్‌) రైళ్ళను నడుపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు ఓ ప్రకటన జారీ చేశారు. ఈ రైళ్లను నడిపేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ నుంచి సేలం, మంగళూరుకు నడిపే రైళ్లను మళ్ళీ రద్దు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2021-06-13T18:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising