ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి సేకరణలో 16.56 శాతం వృద్ధి

ABN, First Publish Date - 2021-02-25T07:13:54+05:30

దేశ వ్యాప్తంగా వరి సేకరణలో గతేడాది కంటే ఈ ఏడు ఇప్పటివరకు 16.56 శాతం వృద్ధిని సాధించినట్లు కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్యధిక సేకరణ రాష్ర్టాల జాబితాలో ఏపీ, తెలంగాణ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా వరి సేకరణలో గతేడాది కంటే ఈ ఏడు ఇప్పటివరకు 16.56 శాతం వృద్ధిని సాధించినట్లు కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ వెల్లడించింది. 2020-21 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఈ నెల 22 వరకు దేశంలో మొత్తం 658.61 లక్షల టన్నుల వరిని రైతుల నుంచి సేకరించగా, గతేడాది ఇదే సమయానికి 565.03 లక్షల టన్నులు సేకరించినట్లు ఆ శాఖ బుధవారం పేర్కొంది. పంజాబ్‌ అత్యధికంగా 202.82 లక్షల టన్నులు (30.79ు) సేకరించింది. అత్యధికంగా వరి సేకరించిన 10 రాష్ర్టాల్లో పంజాబ్‌, యూపీ, హరియాణా, ఛత్తీ్‌సగఢ్‌ తెలంగాణ, ఒడిశా, ఏపీ, మధ్యప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి.  



పప్పుధాన్యాల కొనుగోలుకు అనుమతి 

మద్దతు ధర పథకం కింద ప్రస్తుత ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో రైతుల నుంచి 51.92 లక్షల టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజలు కొనుగోలు చేయడానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, హరియాణా, యూపీ, ఒడిసా, రాజస్థాన్‌ రాష్ర్టాలకు అనుమతి ఇచ్చినట్లు ఆహారం, ప్రజాపంపిణీ శాఖ తెలిపింది. 2020-21 రబీ మార్కెటింగ్‌ సీజన్‌లో రైతుల నుంచి 26.69 లక్షల టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజలు సేకరించడానికి ఏపీ, తెలంగాణ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలను అనుమతించినట్లు వెల్లడించింది.  


Updated Date - 2021-02-25T07:13:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising