ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్‌లో 15 రోజుల కఠిన లాక్‌డౌన్ షురూ

ABN, First Publish Date - 2021-05-11T17:22:43+05:30

కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రకటించిన 15 రోజుల కఠిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రకటించిన 15 రోజుల కఠిన లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఈనెల 24 వరకూ రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్ అమలులో ఉంటుందని, లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, ఆంక్షలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అశోక్ గెహ్లాట్ తెలిపారు. కరోనా విస్తరణను నిరోధించే విషయంలో ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజా ప్రతినిధులు సైతం లాక్‌డౌన్ విజయవంతమయ్యేందుకు కృషి చేయాలని కోరారు. గత ఏడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తిరిగి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని కేంద్రాన్ని కోరారు.


రాష్ట్రంలో 15 రోజుల లాక్‌డౌన్ సమయంలో అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీ సేవలు మినహా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి లేదా జిల్లా నుంచి జిల్లాకు రాకపోకలను అనుమతించమని, అంతర్రాష్ట్ర వాహనాల రాకపోకలకు కూడా అనుమతించేది లేదని చెప్పారు. ప్రార్థనా స్థలాలు, ఎంజీఎన్ఆర్‌ఈజీఏ పనులు సస్పెండ్ చేశారమన్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా నెగిటివ్ ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుందని, అది కూడా 72 గంటల లోపు తీసుకున్నదై ఉండాలని అన్నారు. నెగిటివ్ రిపోర్టు లేకుండా 15 రోజుల పాటు క్వారంటైన్‌కు పంపుతామన్నారు. వలసలను నిరోధించేందుకు గాను ఫ్యాక్టరీలు, నిర్మాణ ప్రాంతాలు పారిశ్రామిక యూనిట్లలో పనులకు అనుమతించామని చెప్పారు.

Updated Date - 2021-05-11T17:22:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising