ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ మందిరానికి విరాళాలు.. 15 వేల చెక్కులు బౌన్స్!

ABN, First Publish Date - 2021-04-16T18:23:33+05:30

అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సేకరించిన 15 వేల బ్యాంకు చెక్కులు బౌన్స్ అయ్యాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయోధ్య: అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సేకరించిన 15 వేల బ్యాంకు చెక్కులు బౌన్స్ అయ్యాయి. వీటి విలువ రూ.22 కోట్లుగా ఉంది. బ్యాంకు ఖాతాల్లో సరిపడా నిధులు లేకపోవడం లేదా సాంకేతిక లోపాల కారణంగా చెక్కులు బౌన్స్ అయినట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన ఆడిట్ నివేదికలో వెల్లడించింది. సాంకేతిక లోపాలను సవరించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా పేర్కొన్నారు. ప్రజలు మరోసారి డొనేషన్ ఇవ్వాలని బ్యాంకులు అడుగుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ చెక్కుల్లో దాదాపు 2 వేల చెక్కులు అయోధ్య నుంచే వచ్చినట్టు మిశ్రా పేర్కొన్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వీహెచ్‌పీ విస్తృతంగా విరాళాలు సేకరించింది. ఈ సందర్భంగా దాదాపు రూ.5 వేల కోట్లు సమకూరగా... తుది వివరాలను ట్రస్ట్ ఇంకా ప్రకటించలేదు. 

Updated Date - 2021-04-16T18:23:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising