రాత్రికి రాత్రే కోటీశ్వరుడు
ABN, First Publish Date - 2021-09-02T08:53:03+05:30
మహారాష్ట్రలో ఓ మత్స్యకారుడు రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. మహారాష్ట్ర పాల్‌ఘర్ జిల్లాలోని ముర్బే గ్రామానికి చెందిన చంద్రకాంత్ తారే తన బృందంతో కలిసి ఆగస్టు 28న పడవలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాడు.
మత్స్యకారుడి వలకు చిక్కిన రూ.1.33 కోట్ల విలువైన 150 ‘బంగారు’ చేపలు
ముంబై, సెప్టెంబరు 1: మహారాష్ట్రలో ఓ మత్స్యకారుడు రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. మహారాష్ట్ర పాల్‌ఘర్ జిల్లాలోని ముర్బే గ్రామానికి చెందిన చంద్రకాంత్ తారే తన బృందంతో కలిసి ఆగస్టు 28న పడవలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాడు. తన వలలో ఒకేసారి 150 ఘోల్ చేపలు పడ్డాయి. ఇవి అత్యంత రుచికరంగా ఉంటాయి. ఈ చేపలతో ఔషధాలు, అత్యంత ఖరీదైన ఇతర ఉత్పత్తులు తయారు చేస్తుంటారు. విదేశాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. వీటిని ‘బంగారు గుండె కలిగిన చేప’ అని కూడా అంటారు. వాటిని వేలం వేయగా రూ.1.33 కోట్ల ధర పలికింది.
Updated Date - 2021-09-02T08:53:03+05:30 IST