ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దు భద్రత.. 12 అదనపు బెటాలియన్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి!

ABN, First Publish Date - 2021-03-04T03:12:37+05:30

సరిహద్దు వద్ద రక్షణ వ్యవస్థలను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 13 వేల మంది సైనికులు కలిగిన 12 అదనపు బెటాలియన్లు ఏర్పాటు చేసుకునేందుకు సహస్రసీమాబల్‌కు(ఎస్ఎస్‌బీ) కేంద్రం అనుమతించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సరిహద్దు వద్ద రక్షణ వ్యవస్థలను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 13 వేల మంది సైనికులు కలిగిన 12 అదనపు బెటాలియన్లు ఏర్పాటు చేసుకునేందుకు సహస్రసీమాబల్‌కు(ఎస్ఎస్‌బీ) కేంద్రం అనుమతించింది. భారత్, నేపాల్, భూటాన్ సరిహద్దుల వద్ద ఎస్ఎస్‌బీ దళాలు పహారా కాస్తుంటాయి‌. అయితే.. ట్రై జన్షన్ వద్ద రక్షణ వ్యవస్థలను పటిష్టపరచడం కూడా కేంద్రం నిర్ణయం వెనుకున్న మరో ప్రధాన కారణం. ఈ ప్రాంతానికి సమీపంలోనే 2017లో భారత్-చైనాల మధ్య డోక్లామ్ ప్రతిష్టంభన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా..  విడతల వారీగా వచ్చే నాలుగేళ్లలో ఈ బెటాలియన్ల ఏర్పాటు జరుగుతుందని ఎస్ఎస్‌బీ డైరెక్టర్ జనరల్ రాజేశ్ చంద్ర తెలిపారు. 


కొత్త బెటాయిన్ల కారణంగా సరిహద్దు వద్ద ఉన్న సైనిక ఔట్‌పోస్టల మధ్య దూరం తగ్గుతుందని తెలుస్తోంది. నేపాల్ భూటాన్ సరిహద్దుల వద్ద భద్రతను మరింత పిటిష్టత పరచాల్సిందిగా హోం మంత్రి అమిత్ షా ఎస్ఎస్‌బీకి గతేడాది అక్టోబర్‌లో సూచించారు. ఇందుకోసం కోసం అదనంగా 12 కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఎస్ఎస్‌బీ హొం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపింది. సరిహద్దు వద్ద ఓ ప్రధాన సైనిక స్థావరంతో పాటూ మూడు కొత్త సెక్టర్ స్థావరాలను కూడా ఏర్పాటు చేయాలని తన ప్రతిపాదనలో పేర్కొంది.  అయితే కేంద్రం.. 12 బెటాలియన్లకు అనుమతిచ్చినప్పటికీ.. ఒకటే సెక్టర్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిచ్చింది.  

Updated Date - 2021-03-04T03:12:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising