ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్సిజన్ అందక చెన్నైలో 13 మంది మృతి?

ABN, First Publish Date - 2021-05-05T20:44:36+05:30

కరోనా రోగులను ఆక్సిజన్ కొరత వేధిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న ఢిల్లీ, కర్నాటకలో ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : కరోనా రోగులను ఆక్సిజన్ కొరత వేధిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న ఢిల్లీ, కర్నాటకలో ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు మృతి చెందినట్లు వార్తలొచ్చిన విషయం విదితమే. తాజాగా చెన్నైలోని ప్రభుత్వాసుపత్రిలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకూ దాదాపు 13 మంది కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే దీనిని ఆస్పత్రి వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. ఆక్సిజన్ అందక వారు మరణించారన్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంటున్నారు. వారి వారి వ్యక్తిగత అనారోగ్య కారణాల రీత్యానే ఆ 13 మంది మరణించారని పేర్కొంటున్నారు. ఈ విషయంపై చెంగల్‌పట్టు కలెక్టర్ జాన్ లూయిస్ స్పందించారు. ‘‘లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. కానీ 40 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోనే ఉన్నాయి.


వారందరూ వారి వారి వ్యక్తిగత ఆరోగ్య కారణాల రీత్యానే మరణించారు’’ అని కలెక్టర్ ప్రకటించారు. అయితే ఆస్పత్రిలోని కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. ‘‘మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచే ఆస్పత్రిలోని ఐసీయూతో సహా వివిధ బ్లాక్‌లలోని పేషెంట్లు మృతి చెందినట్లు తెలిసింది. మంగళవారం ఆక్సిజన్‌ను సిలిండర్లలో నింపడంలో కాస్తంత జాప్యం జరిగింది. వాస్తవానికి ఆక్సిజన్ సిలిండర్ మధ్యాహ్నం `12 గంటలకే రావాల్సి ఉండింది. అది కాస్త సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వచ్చింది. దీంతో ఆక్సిజన్ సరఫరాకు జాప్యం ఏర్పడింది’’ అని ఆస్పత్రిలోని కొన్ని వర్గాలు పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-05-05T20:44:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising