ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై దొరికిన Mobile బ్యాటరీని ఇంటికి తీసుకెళ్లిన బాలుడు.. Charging పెట్టగా పేలిపోయి ఊపిరితిత్తుల్లోకి ముక్కలు..!

ABN, First Publish Date - 2021-11-15T02:39:46+05:30

సరదాగా ఆడుకోవడానికి రోడ్డుపైకెళ్లిన బాలుడికి మొబైల్ ఫోన్ బ్యాటరీ దొరికింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ : సరదాగా ఆడుకోవడానికి రోడ్డుపైకెళ్లిన బాలుడికి మొబైల్ ఫోన్ బ్యాటరీ దొరికింది. అసలు ఇది పనిచేస్తోందా.. లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించి ఆస్పత్రిపాలయ్యాడు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.. ఇలాగే ఉంటే సర్జరీ చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లోని కుర్రాహ అనే గ్రామంలో చోటుచేసుకుంది.


పూర్తి వివరాల్లోకెళితే.. కుర్రాహ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు అఫ్జల్ ఖాన్ శనివారం నాడు ఆడుకోవడానికి రోడ్డుపైకి వెళ్లాడు. రోడ్డుపై పడున్న మొబైల్ బ్యాటరీని చూశాడు.. తనకేదో దొరికిందని ఎగిరిగంతేసి వెంటనే జేబులో పెట్టుకుని ఇంటికి పరుగులు తీశాడు. అంతటితో ఆగుంటే ఇప్పుడు ఆస్పత్రి దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో. ఈ బ్యాటరీ ఏంటి..? పనిచేస్తోందా..? లేదా అని తెలుసుకోవాలని బ్యాటరీకున్న రెండు పాయింట్లకు వైర్‌లు కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టాడు. చేతిలో పట్టుకుని ఇలా చేయడంతో ఆ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అఫ్జల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బ్యాటరీ ముక్కలు శరీరంలోకి చొచ్చుకుపోయి ఊపిరితిత్తులు, కాలేయంలోకి ప్రవేశించాయి. గాయపడ్డ కుమారుడిని హుటాహుటిన తల్లి రుక్సర్ స్థానికంగా ఉన్న జిల్లా ఆస్పత్రికి తరలించారు.


ఈ ఘటనపై ఆస్పత్రి సీనియర్ సర్జన్ వి.పి శేషా మాట్లాడుతూ.. బ్యాటరీ ముక్కలు శరీరంలోకి లోతుగా చొచ్చుకుపోయాయన్నారు. దీంతో శరీరం లోపలి భాగాలను తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. బ్యాటరీ ముక్కలు కాలేయం, ఊపిరితిత్తులలోకి ప్రవేశించాయని తెలిపారు. ప్రస్తుతం కాలేయం నుంచి తీవ్ర రక్తస్రావం అవుతోందని.. ఇది ఆగకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పారు. చేతులు, కాళ్లు, నోరు, పొట్ట, ఛాతీ భాగాల్లో కూడా తీవ్రంగానే గాయాలయ్యాయని అఫ్జల్ పరిస్థితి విషమంగానే ఉందని సర్జన్ చెబుతున్నారు.

Updated Date - 2021-11-15T02:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising