ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగా నదిలో తేలిన 100 కొవిడ్ మృతదేహాలు

ABN, First Publish Date - 2021-05-10T22:22:12+05:30

ఉత్తరప్రదేశ్‌లో వందల సంఖ్యలో కోవిడ్ మృతులను కాల్చివేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపధ్యంలో గంగానదిలో తేలిన మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌కు చెందినేవనని బిహార్ అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలోని గంగా నదిలో 100 కొవిడ్ మృతదేహాలు వెలుగు చూశాయి. అయితే వీటి గురించి ఆరా తీయగా ఇవి ఉత్తరప్రదేశ్‌ నుంచి కొట్టుకు వచ్చాయని, తమ రాష్ట్రానికి చెందినవి కావని బక్సర్ జిల్లా అధికార యంత్రాంగం బదులు ఇచ్చింది. జిల్లాలోని మహదేవ్ ఘాట్ వద్ద సుమారు 100 మృతదేహాలు గంగా నది నీటిలో తేలియాడుతూ కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


చౌదాకు చెందిన బీడీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘‘మహదేవ్ ఘాట్‌కు 40 నుంచి 45 శవాల వరకు కొట్టుకువచ్చాయి. ఇవి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవి. కొవిడ్‌తో ఇక్కడి వారెవరైనా మరణిస్తే కాల్చివేసే సంప్రదాయం ఉంది. దానికి ఒక కాపలా దారుడిని పెట్టి మరీ కాల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ఇవి ఉత్తర ప్రదేశ్ నుంచే వచ్చి ఉంటాయి. నదిలో మృతదేహాలను అడ్డుకునే మార్గం లేనందున ఇక్కడి వరకు కొట్టుకువచ్చాయి’’ అని అన్నారు.


ఉత్తరప్రదేశ్‌లో వందల సంఖ్యలో కొవిడ్ మృతులను కాల్చివేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపధ్యంలో గంగానదిలో తేలిన మృతదేహాలు ఉత్తరప్రదేశ్‌కు చెందినేవనని బిహార్ అధికారులు చెప్తుండడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే నెటిజెన్లు పెద్ద ఎత్తున ఈ విషయమై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.



Updated Date - 2021-05-10T22:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising