ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం హెల్ప్‌ సెంటర్‌కు 10 లక్షల ఫిర్యాదులు

ABN, First Publish Date - 2021-02-27T14:21:00+05:30

రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల్లో సీఎం హెల్ప్‌ సెంటర్‌కు 10 లక్షల ఫిర్యాదు లందాయని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ పేర్కొ న్నారు. పింఛన్‌, పట్టా, విద్య ఆర్ధికసాయం తదితర ఫిర్యాదులను ప్రజలు ప్రత్యక్ష్యంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/ప్యారీస్(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల్లో సీఎం హెల్ప్‌ సెంటర్‌కు 10 లక్షల ఫిర్యాదు లందాయని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ పేర్కొ న్నారు. పింఛన్‌, పట్టా, విద్య ఆర్ధికసాయం తదితర ఫిర్యాదులను ప్రజలు ప్రత్యక్ష్యంగా ప్రభుత్వానికే తెలియజేసే పథకాన్ని సీఎం పళనిస్వామి ఈ నెల 13న ప్రారంభించారు. ‘1100’ అనే హెల్స్‌ లైన్‌ నెంబరు ద్వారా కానీ, ఎస్‌ఎంఎస్‌ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను షోలింగనల్లూర్‌లో ఉన్న సీఎం హెల్ప్‌ సెంటర్‌ను సంప్రదించి ఫిర్యాదు నమోదుచేసు కోవచ్చు. ఈ సెంటర్‌ను శుక్రవారం పరిశీలిం చిన సందర్భంగా మంత్రి ఉదయకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, సుమారు రూ.13 కోట్లతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరింపజేసే విధంగా సీఎం ప్రారంభించిన ఈ కేంద్రానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తున్న ఈ కేం ద్రాన్ని 15 రోజుల్లో సుమారు 10 లక్షల మంది సంప్రదించి తమ సమస్యలు తెలియజేసారని  2 లక్షలకు పైగా ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారుల ద్వారా పరిష్కారం కల్పించినట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2021-02-27T14:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising