ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒడిశాలో ఆదివారం నుంచి రాత్రి కర్ఫ్యూ

ABN, First Publish Date - 2021-04-04T01:01:33+05:30

కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఏప్రిల్ 5 నుంచి 10 జిల్లాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ : కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఏప్రిల్ 5 నుంచి 10 జిల్లాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. సుందర్‌గఢ్, జార్సుగూడ, సంబల్‌పూర్, బార్‌గఢ్, బొలంగీర్, నౌపడ, కలహండి, నవరంగపూర్, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో కర్ఫ్యూ అమలవుతుందని తెలిపింది. 


ప్రజాహితం కోసం, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నట్లు వివరించింది. కర్ఫ్యూ సమయంలో అన్ని దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. ప్రజలు ఈ సమయంలో బయటకు రాకూడదని తెలిపింది. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఉందని పేర్కొంది. జిల్లా, నగరపాలక, పురపాలక సంఘాల పరిపాలనా యంత్రాంగాలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులకు  కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉందని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, సిబ్బంది, అంబులెన్సులు, ఎమర్జెన్సీ హెల్త్ స్టాఫ్‌‌కు కూడా మినహాయింపు ఉన్నట్లు వివరించింది. 


Updated Date - 2021-04-04T01:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising