ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 1.6 కోట్ల మందికి అందని రెండవ డోసు టీకా!

ABN, First Publish Date - 2021-08-24T14:45:26+05:30

కేంద్ర ప్రభుత్వం కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండవ డోసు అవధిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండవ డోసు అవధిని 12 నుంచి 16 వారాల మధ్య ఉండేలా మే 13న అనుమతి మంజూరు చేసింది. తాజాగా వచ్చిన రిపోర్టు ప్రకారం దేశంలో తొలిడోసు టీకా తీసుకున్న సుమారు 1.6 కోట్ల మందికి 16 వారాల గడువు దాటినా ఇంకా రెండవ డోసు టీకా అందలేదు. వీరిలో కోటి మంది వృద్ధులేనని తెలుస్తోంది. మిగిలివారిలో హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్స్, 45 ఏళ్లు పైబడివారు ఉన్నారని తెలుస్తోంది. 


కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని 4 నుంచి 6 వారాల మధ్య ఉండవచ్చని ప్రభుత్వం తెలియజేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 16 వారాల క్రితం అంటే మే 2న తొలిడోసు టీకా తీసుకున్న వారి గణాంకాలతో... ఇప్పటివరకూ రెండవ డోసు టీకా తీసుకున్నవారి గణాంకాలను పోల్చిచూస్తే ఇంకా 1.6 కోట్ల మందికి రెండవ డోసు టీకా అందించాల్సివుందని తేలింది. ఈ డేటాను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. 



Updated Date - 2021-08-24T14:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising