ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు సాయం చేస్తే.... నా కుమారుడికి మరో జీవితం

ABN, First Publish Date - 2021-06-28T23:25:55+05:30

"హాస్పిటల్‍‌‌లో వైద్యం అందుకుంటున్న నా బాబు చుట్టూ ఎన్నో మెషీన్లున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

"హాస్పిటల్‍‌‌లో వైద్యం అందుకుంటున్న నా బాబు చుట్టూ ఎన్నో మెషీన్లున్నాయి... కానీ, వాడు మాత్రం మమ్మల్ని  చిరునవ్వుతో పలుకరిస్తున్నాడు. మా అబ్బాయి పుట్టినప్పటి నుంచీ అనారోగ్యంతో బాధపడున్నప్పటికీ, వాడు తన పోరాటం ఆపలేదు. నాలో ఆశలు రేపుతున్నాడు. తల్లిగా నాకు ఎంత గర్వంగా ఉంది కానీ, త్వరగా ఏదో ఒకటి చెయ్యకపోతే ఆ రోగం వాడిని మాకు దూరం చేస్తుందేమోనని భయంగా ఉంది" అని వేదనగా చెప్పింది ఉస్మాన్ తల్లి జీనత్.


జీనత్, ఫైజాన్‌ల 6 నెలల చిన్నారి ఉస్మాన్ వారి ఇంటికి వెలుగు. ఆ పసివాడిని కాపాడుకోవడానికి చెయ్యగలిగిందంతా చేస్తున్నారు. ఆ కుటుంబంలో ఏకైక సంపాదనపరుడు ఫైజాన్ మాత్రమే. అనుకోకుండా ఒక రోజున ఉస్మాన్ అనారోగ్యానికి గురయ్యే వరకూ వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. చివరికి అది ముగింపులేని పీడకలగా మారింది.


ఉస్మాన్‌ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళి డాక్టర్లకు చూపించి టెస్టులు చేశారు. ఆ చిన్నారి బాలుడు లివర్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నాడని డాక్టర్లు చెప్పారు.


జీనత్, ఫైజాన్‌ల ఇప్పటికే ఇటువంటి తీవ్ర సమస్య కారణంగా మొదటి సంతానాన్ని కోల్పోయారు. ఉస్మాన్ పుట్టిన తర్వాతే ఆ బాధ నుంచి వారు కోలుకున్నారు. కాని, ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితే ఉస్మాన్‌కు ఎదురై, ఈ చిన్నారి ప్రాణాన్ని ప్రమాదపుటంచులకు తీసుకెళ్ళింది.


ఉస్మాన్‌ని కాపాడుకోవాలంటే వెంటనే వెంటనే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ జరగాలని డాక్టర్లు తెలియజేశారు. దాతగా తండ్రి ఫైజాన్‌ని డాక్టర్లు నిర్ణయించినప్పటికీ, వీరి సమస్య ఇంకా తీరలేదు.


ఉస్మాన్‌కి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యడానికి సుమారు రూ.16.5 లక్షలు ($ 22224.77) ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంత మొత్తాన్ని భరించి ఆర్ధిక స్తోమత ఈ కుటుంబానికి లేదు. చిన్న చిన్న పనులు చేసుకునే ఫైజాన్ ఆదాయం నెలకు రూ.5 వేలు మాత్రమే.


ఈ పరిస్థితి ఎదురైనందుకు జీనత్ రోదిస్తూ అల్లాను ప్రార్థిస్తూనే ఉంది. తన ఏకైక కుమారుడిని కాపాడుకోవడానికి ఈ ట్రాన్స్‌ప్లాంట్ ఖర్చును భరించగలిగే శక్తినిమ్మని వేడుకుంటోంది.


ఇప్పటివరకూ తమ దగ్గరున్న డబ్బులు, అప్పు చేసిన మొత్తం, నగలమ్మిన సొమ్ము... అంతా ఖర్చు చేసినా ఇంకా చాలని పరిస్థితి.


తమ శక్తిమేరకు చెయ్యగలిగిందంతా చేసిన జీనత్, ఫైజాన్ ఇప్పుడు మీ సాయం కోరుతున్నారు.


చెదిరిన హృదయాలతో కన్నీటిపర్యంతమవుతున్న ఈ తల్లిదండ్రులకు ఉన్న ఎకైక అశ మీరు మాత్రమే. కేవలం డబ్బు లేనంత మాత్రం చేత ఈ బోసినవ్వులు దూరమయ్యే పరిస్థితి కలుగకూడదు. ఉస్మాన్ చికిత్స కోసం దయచేసి నిండు మనస్సుతో ఈ నిరుపేద అమ్మానాన్నలకు చేయూతనివ్వండి. ఆ చిరునవ్వులు చిరకాలం నిలిచేలా చెయ్యండి.

Updated Date - 2021-06-28T23:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising