ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్న కడుపునే చీల్చేశాడు..!

ABN, First Publish Date - 2021-01-10T12:09:46+05:30

జులాయిగా తిరుగుతూ జల్సాలకు డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడో కొడుకు. ఈ ఘటన బల్కంపేట ఎస్‌ఎ్‌సబేకరీ వీధి అమోఘ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జల్సాలకు డబ్బులు ఇవ్వడం లేదని తల్లిని చంపిన కొడుకు

బల్కంపేటలో దారుణం


అమీర్‌పేట: జులాయిగా తిరుగుతూ జల్సాలకు డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లిని కత్తితో విచక్షణారహితంగా  పొడిచి హత్య చేశాడో కొడుకు. ఈ ఘటన బల్కంపేట ఎస్‌ఎ్‌సబేకరీ వీధి అమోఘ జూనియర్‌ కళాశాల వెనుక వీధిలో శనివా రం మధ్యాహ్నం జరిగింది. ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులు కథనం ప్రకారం.. కర్నాటక రాష్ట్రానికి చెందిన వీరప్ప, సంగీతలు తమ ఐదుగురు పిల్లలలో కలిసి నగరానికి వచ్చి బల్కంపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరప్ప వీధి వ్యాపారం చేసేవాడు. సంగీత ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఇద్దరు కుమారులు, పెద్దకూతురికి వివాహం కాగా, చిన్న కూతురు, చివరి కొడుకు సంతో్‌షలకు వివాహాలు కావాల్సి ఉంది. అనారోగ్యం బారిన పడిన వీరప్ప ఏడాది క్రితం చనిపోయాడు.


పెద్దకొడుకులు ఆటో డ్రైవర్లుగా  పని చేస్తుండగా, చిన్న కొడుకు సంతోష్‌ పనీపాట లేకుండా జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బుల కోసం తల్లి సంగీతను తరచూ వేధిస్తూ గొడవ పడేవాడు. ఆమెను కొడుతుండే వాడు. రోజూ మాదిరిగానే ఇళ్లలో పని చేసిన సంగీత శనివారం మధ్యాహ్నం 1.30గంటలకు ఇంటికి వచ్చింది. డబ్బుల కోసం సంతోష్‌ చెల్లెలి ఎదుటే తల్లితో గొడవ పడ్డాడు.  డబ్బులు ఇచ్చేందు కు తల్లి నిరాకరించడంతో ఇంట్లో కూరగాయలు తరిగే కత్తి తీసుకొచ్చి పొట్ట భాగంలో విచక్షణారహితంగా పొడిచాడు. అదే కత్తితో పొట్టను చీరేశాడు. దీంతో పేగులు బయటపడి రక్తపు మడుగులో కుప్పకూలి సంగీత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణాన్ని దగ్గరుండి చూసిన చిన్న కూతురు భయంతో వణుకుతూ ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. జరిగిన ఘాతుకాన్ని గురించి బాబాయ్‌కి ఫోన్‌ చేసి చెప్పింది. తల్లీకొడుకుల మధ్య పెనుగులాట జరుగుతున్న సందర్భంగా అరుపులు విన్న స్థానికులు తలుపులు తెరిచి చూడగా, సంగీత రక్తపు మడుగులో పడిఉంది. తలుపు తెరవగానే పారిపోయేందుకు సంతోష్‌ ప్రయత్నించగా, పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అడిషనల్‌ డీసీపీ ఎక్బాల్‌ సిద్ది ఖీ, పంజాగుట్ట ఏసీపీ గణే్‌షలు వచ్చి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-10T12:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising