ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా పసిగుండెను కాపాడే భారం మీదే...

ABN, First Publish Date - 2021-09-04T00:18:02+05:30

శ్రియాన్ నా తొలిచూరు సంతానం. వాడు నాకు దూరం కాకుండా చూసే భారం మీదే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రియాన్ నా తొలిచూరు సంతానం. వాడు నాకు దూరం కాకుండా చూసే భారం మీదే...

ఈ ఏడాది మొదట్లో మా అబ్బాయి పుట్టినప్పుడు మేమంతా చందమామ చేతికందినంత ఆనందపడ్డాం. నా చిట్టి కన్నయ్యను నా చేతుల్లో ఉంచుకుని చూస్తున్నంతసేపూ వాడు లేని బ్రతుకు అనే ఊహనైనా భరించలేనని అర్థమైంది. కానీ, శ్రియాన్ పుట్టిన నెల తర్వాత నా కొడుక్కి ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉన్నట్టు తెలిసింది. అంత చిన్న వయస్సులోనే నా కొడుక్కి ఇలా జరుగుతుందని నేను కలలోనైనా అనుకోలేదు. ఈ పరిస్థితి కన్న తల్లిదండ్రులకు నిజంగా పీడ తప్ప మరొకటి కాదు.


శ్రియాన్ సరిగ్గా ఊపిరి తీసుకోకపోవడాన్ని మేం గమనించడంతో ఈ సమస్య బయటకొచ్చింది. కొన్నిసార్లు మా అబ్బాయి చాలా మెల్లగా ఊపిరి తీసుకుంటూ వదిలేవాడు. ఇంకొన్నిసార్లు చాలా వేగంగా శ్వాస తీసుకునేవాడు. ఇది చాలక, వాడు త్వరగా అలసిపోయి ఆయాసపడేవాడు. నేనెంత ప్రయత్నించినా మా బాబుకు పాలివ్వడం, నిద్రపుచ్చడం చాలా కష్టమయ్యేది. ఆ పసివాడికి కాసేపైనా విశ్రాంతి దొరికేది కాదు. శ్రియాన్‌ని పరీక్షించిన డాక్టర్లు, మా బాబుకు Large muscular ventricular septal defect ఉందని చెప్పారు.


అదేమిటంటే, శ్రియాన్‌కి పుట్టుకతోనే గుండెలో ఒక పెద్ద రంధ్రం ఉంది. దానికి చికిత్స చెయ్యకుండా వదిలేస్తే, కొద్ది నెలల్లోనే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుందట. చివరికి వాడి తొలి పుట్టినరోజు కూడా జరుగుతుందో.. లేదో.. అంటున్నారు. కేవలం ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా మాత్రమే శ్రియాన్‌ని కాపాడగలమని డాక్టర్లు మాకు చెప్పారు. ఇందుకు సుమారుగా రూ.6 లక్షలు ($ 8211.76) ఖర్చవుతుందన్నారు. ఇదంతా విని మా గుండె చెదిరిపోయింది. మా బాబును కాపాడుకోవడానికి అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం మావల్ల అయ్యే పని కాదని నాకు తెలుసు.



మా కుటుంబంలో నా భర్త రాజు మాత్రమే సంపాదిస్తాడు. వ్యవసాయం చేస్తూ నెలకు కేవలం రూ.6 వేలు మాత్రమే ఆర్జిస్తాడు. శ్రియాన్ పరిస్థితి తెలిసిన వెంటనే తనను ఆస్పత్రిలో చేర్చాం. అప్పటి నుంచీ మాకున్నదంతా వాడి కోసమే ఖర్చుపెట్టేశాం. ఇప్పుడు మా అబ్బాయికి చికిత్స చేయించడానికి మా దగ్గర ఏమీ లేవు. మేము ప్రస్తుతం దాతల సహాయం పైనే ఆధారపడ్డాం. మీ విరాళాలే మా బాబును కాపాడతాయి. మా పసిప్రాణం చల్లగా బతకాలి... అందుకు మీరంతా తోడై నిలవాలి.


శ్రియాన్ కు సాయం చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి

Updated Date - 2021-09-04T00:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising