ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వామీజీ కిడ్నాప్‌ కలకలం

ABN, First Publish Date - 2021-01-20T13:17:34+05:30

ఓ స్వామిజీని కిడ్నాప్‌ చేశారన్న ఘటన కలకలం రేపింది. గుండెపోటు వచ్చిందని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన స్వామిజీని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని తెలపడంతో అనుమానాస్పదంగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు 

లంగర్‌హౌస్‌: ఓ స్వామిజీని కిడ్నాప్‌ చేశారన్న ఘటన కలకలం రేపింది. గుండెపోటు వచ్చిందని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన స్వామిజీని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని తెలపడంతో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం... బీదర్‌ కమలాపూర్‌మట్‌కు చెందిన జయంత్‌రావ్‌ స్వామిజీ(మాతాజీ)తో కలిసి సతీ్‌షరెడ్డి, సంతో్‌షరెడ్డి కారులో హైదరాబాద్‌కు వచ్చారు. షిరిడి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులపై జయంత్‌రావ్‌కు అనుమానం వచ్చింది. అయితే హైదరాబాద్‌ రాగానే స్వామిజీకి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. స్వామిజీ ఆస్పత్రిలో ఉన్నాడన్న విషయాన్ని వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులు నగరంలోని పలువురు భక్తులకు సమాచారం అందించారు. దీంతో భక్తులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తన వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉందని, వీరు కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జయంత్‌రావ్‌ భక్తులకు తెలపడంతో భక్తులు లంగర్‌హౌస్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు స్వామిజీ కిడ్నా్‌పపై విచారణ జరుపుతున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 


విచారిస్తున్నాం..

స్వామీజీ జయంత్‌రావ్‌ కిడ్నాప్‌ విషయంపై విచారిస్తున్నామని లంగర్‌హౌస్‌ పోలీ్‌సస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. బీదర్‌లోని జయంత్‌రావ్‌ స్వామీజీ వెంట సతీ్‌షరెడ్డి, సంతో్‌షరెడ్డి నగరానికి వచ్చారని, నగరం నుంచి బెంగుళూర్‌కు బయలుదేరి మళ్లీ నగరానికి చేరుకున్నారని అయితే గుండెపోటుతో స్వామీజీని సోమవారం రాత్రి నానాల్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, కిడ్నాప్‌ చేశారా, ప్రయత్నిస్తున్నారా, ఇందులో ఏది వాస్తవమని విచారిస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-20T13:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising