ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయన విరాళం... 102 బిలియన్ డాలర్లు...

ABN, First Publish Date - 2021-06-25T03:33:55+05:30

ఆయన..జ. విరాళం 102 బిలియన్ డాలర్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా విరాళం ఇచ్చి ప్రధమ స్థానంలో నిలిచింది భారతీయుడే.  జెంషెట్​జీ టాటా... టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు. ఆయన... మొత్తంమీద 102 బిలియన్​ డాలర్లను సేవాకార్యక్రమాలకు వినియోగించారు. దక్షిణ గుజరాత్‌లోని నవ్‌సరి అనే నగరంలో 1839 లో జన్మించిన టాటా 1870 లలో సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్, వీవింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని ప్రారంభించారు. మరోవైపు టాటా ట్రస్ట్‌ల ద్వారా సేవాకార్యక్రమాలు ప్రారంభించారు.


టాటా తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్​ సహ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్, ఆయన మాజీ భార్య మెలిందా సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి 74.6 బిలియన్​ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. ఇక... 37.4 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు ప్రముఖ ఇన్వెస్టర్​ వారెన్​ బఫెట్​. సోరస్ 34.8 బిలియన్​ డాలర్లను విరాళంగా ఇచ్చి ​ నాలుగో స్థానములో ఉండగా.. జాన్ డీ రాక్​ఫెల్లర్ 26,8 బిలియన్​ డాలర్లు విరాళంతో ఐదో స్థానములో నిలిచారు.అయితే ఈ టాప్ 50 లో మరో భారతీయుడు విప్రో అధినేత అజీమ్​ ప్రేమ్​జీ కూడా ఉన్నారు. ఈయన 22 బిలియన్​ డాలర్లు వితరణ చేసినట్లు నివేదిక పేర్కొంది.


మొత్తం యాభై మంది ఉన్న ఈ జాబితాలో మొత్తం 38 మంది అమెరికాకు చెందినవారు ఉండగా, యూకేకు చెందిన ఐదుగురు,, చైనీయులు ముగ్గురు ఉన్నారు. ఈ 50 మంది కలిసి.. గత 100 ఏళ్లలో మొత్తం 832 బిలియన్ డాలర్ల సేవాకార్యక్రమాలు నిర్వహించినట్లు.. వివిధ సంస్థల ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహించినట్లు నివేదిక వెల్లడించింది. 

Updated Date - 2021-06-25T03:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising