ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్త సమాచారం ఒకేచోట..!

ABN, First Publish Date - 2021-01-19T13:22:57+05:30

గ్రేటర్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట క్రోడికరించేలా కసరత్తు జరుగుతోంది. ఎన్ని ఇళ్లు ఉన్నాయి. ఎంత మంది ఉంటున్నారు. మురికివాడలెన్ని.. వంటి పౌర సంబంధ వివరాలతోపాటు, రహదారులు, తాగునీటి సరఫరా, మురుగు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీహెచ్‌ఎంసీలో అర్బన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ సెల్‌

ప్రత్యేక విభాగం దిశగా అడుగులు

పట్టణ ప్రణాళిక, ఐటీ, ఎకనామిక్స్‌ 

అండ్‌ స్టాటిస్టికల్‌ విభాగాల సమన్వయం

పౌర సంబంధిత వివరాల నుంచి..మౌలిక సదుపాయాల వరకు

నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం 


హైదరాబాద్‌: గ్రేటర్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట క్రోడికరించేలా కసరత్తు జరుగుతోంది. ఎన్ని ఇళ్లు ఉన్నాయి. ఎంత మంది ఉంటున్నారు. మురికివాడలెన్ని.. వంటి పౌర సంబంధ వివరాలతోపాటు, రహదారులు, తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ తదితర మౌలిక సదుపాయాల సమాచారాన్ని కూడా సేకరించనున్నారు. పూర్తి వివరాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌  చేసేలా చర్యలు తీసుకోనున్నారు. జీహెచ్‌ఎంసీలో అర్బన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ పేరిట అన్ని వివరాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఐటీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ఈ సెల్‌ పని చేస్తుంది. బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగానికి చెందిన సీనియర్‌ అధికారికి ఈ సెల్‌ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే నెల రోజుల్లో విభాగం ఏర్పాటు పూర్తవుతుందని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారొకరు తెలిపారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-19T13:22:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising