ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటి డోసు కోవ్యాక్సిన్... రెండవ డోసు కోవీషీల్డ్... భయంలో వృద్ధుడు!

ABN, First Publish Date - 2021-04-15T16:46:56+05:30

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాజ్‌గంజ్: ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా ఆరోగ్య విభాగం నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచింది. స్థానికంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌లో ఒక వృద్ధునికి తొలి డోసులో కోవ్యాక్సిన్, రెండవ డోసులో కోవీషీల్డ్ టీకాలను ఇచ్చారు. ఈ విషయం టీకా వేయించుకున్న వ్యక్తికి తెలియడంతో ఆసుపత్రిలో నానా హంగామా చోటుచేసుకుంది. ఈ ఉదంతం పైఅధికారుల వరకూ చేరడంతో వారు దర్యాప్తునకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే బాధితునికి ఫిబ్రవరి 25న మొదటి డోసు కోవ్యాక్సిన్ టీకా ఇచ్చారు. 


రెండవ డోసు మార్చి 25న ఇస్తామని వైద్య సిబ్బంది అతనికి తెలిపారు. అయితే ఏవో కారణాలతో అతను మార్చి 25న ఆసుపత్రికి వెళ్లలేకపోయాడు. అయితే ఏప్రిల్ 13న రెండవ టీకా కోసం ఆసుపత్రికి వచ్చాడు. అయితే అక్కడి వైద్య సిబ్బంది అతనికి కోవ్యాక్సిన్‌కి బదులు కోవీషీల్డ్ టీకా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అతను ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు రెండు రకాల టీకాలు ఇచ్చారని తెలియగానే ఆ వృద్ధుడు భయపడిపోయాడు. అయితే వైద్యులు అతనిలోని భయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. దీని వలన ఏమీ కాదని తెలియజెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏకే శ్రీవాస్తవ మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకున్నాక అతనిలో ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ కనిపించలేదని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

Updated Date - 2021-04-15T16:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising