ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తిడి తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..

ABN, First Publish Date - 2021-11-06T18:17:04+05:30

కోవిడ్‌ వల్ల వర్క్‌ఫ్రం హోం చాలా మంది ఉద్యోగులకు తప్పనిసరి అయింది. దీని వల్ల కొంత సౌలభ్యం ఉన్నా- ఇబ్బందులు కూడా ఎక్కువే ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఇంటి పని అటు ఆఫీసు పని చేసుకొనే మహిళలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి దూరం కావాలంటే పాటించాల్సిన చిట్కాలేమిటో చూద్దాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(06-11-2021)

కోవిడ్‌ వల్ల వర్క్‌ఫ్రం హోం చాలా మంది ఉద్యోగులకు తప్పనిసరి అయింది. దీని వల్ల కొంత సౌలభ్యం ఉన్నా- ఇబ్బందులు కూడా ఎక్కువే ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఇంటి పని అటు ఆఫీసు పని చేసుకొనే మహిళలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి దూరం కావాలంటే పాటించాల్సిన చిట్కాలేమిటో చూద్దాం..


సమయ పాలన

ఏ పనికి ఎంత కేటాయించాలో తెలియకపోయినా.. పనులు చేసే విషయంలో క్రమశిక్షణ లేకపోయినా సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల ఉదయాన్నే లేచిన వెంటనే-  ఆ రోజు చేయాల్సిన పనుల వివరాలు ఒక చోట రాసుకోవటం మంచిది. దీని వల్ల ఆ రోజు చేయాల్సిన ఆఫీసు పనులు, ఇంటి పనుల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. అప్పుడు ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోవచ్చు. దీని వల్ల పనులు సాఫీగా సజావుగా జరుగుతాయి. 


సందిగ్దత వద్దు..

ఇంటి పని చేసేటప్పుడు.. ఆఫీసు పని గురించి ఆలోచించడం.. ఆఫీసు పనిచేసే సమయంలో ఇంటి పని గురించి ఆలోచించటం వల్ల ఆలోచనల్లో సందిగ్దత ఏర్పడుతుంది. ఈ సందిగ్దత వల్ల ఏ పని ముందుకు సాగదు. అందువల్ల ఇంటి పనికి కేటాయించే సమయాన్ని.. ఆఫీసుకు కేటాయించే సమయాన్ని వేర్వేరుగా పెట్టుకుంటే మంచిది. 


ఆరోగ్యమే మహాభాగ్యం

మానసిక ఆరోగ్యంతో పాటుగా శారీరక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. వర్క్‌ ఫ్రం హోం వల్ల చాలా మందికి రకరకాల శారీరక సమస్యలు ఏర్పడుతున్నాయి. అందువల్ల శారీరక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడాలి. ప్రతి రోజు కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలి. 


మిత్రులతో గడపండి..

రోజంతా ల్యాప్‌ట్యాప్‌ లేదా మొబైల్‌ ఫోన్లతో గడిపేవారికి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతుంది. అందువల్ల వారంలో కనీసం రెండు రోజులైనా ల్యాప్‌ట్యాప్‌ను వాడకపోవటం మంచిది. మొబైల్‌ ఫోన్‌ వాడకాన్ని కూడా వీలైనంత తగ్గించాలి. సమీపంలో ఉన్న మిత్రుల వద్దకు వెళ్లి రిలాక్స్‌ కావటం కూడా చాలా ముఖ్యం. లేకపోతే ఒత్తిడి మరింత పెరిగిపోతుంది.

Updated Date - 2021-11-06T18:17:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising