ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పళ్ళు పసుపు పచ్చగా ఎందుకవుతాయంటే..?

ABN, First Publish Date - 2021-09-17T18:08:57+05:30

టానిన్స్‌ ఉండే ఆహారపదార్థాలైన టీ, కాఫీ, కూల్‌డ్రింకులు, వైన్‌ మొదలైనవి తీసుకోవడం, పొగతాగడం, పాన్‌, గుట్కా నమలడం, దంతాలను సరిగా శుభ్రం చేసుకోక పోవడం, ఆహారంలో లేదా నీటిలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉండడం, కొన్ని రకాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(17-09-2021)

ప్రశ్న: పళ్ళు పుసుపు పచ్చగా ఎందుకవుతాయి? పళ్ళ ఆరోగ్యానికి ఏ ఆహారం తీసుకోవాలి?


- సుబ్బారావు, చిత్తూరు


డాక్టర్ సమాధానం: టానిన్స్‌ ఉండే ఆహారపదార్థాలైన టీ, కాఫీ, కూల్‌డ్రింకులు, వైన్‌ మొదలైనవి తీసుకోవడం, పొగతాగడం, పాన్‌, గుట్కా నమలడం, దంతాలను సరిగా శుభ్రం చేసుకోక పోవడం, ఆహారంలో లేదా నీటిలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉండడం, కొన్ని రకాల అనారోగ్యాలు తదితరాల వల్ల దంతాలు పసుపుపచ్చగా మారే  అవకాశం ఉంది. వయసు పెరగడంతో దంతాల పై ఉండే ఎనామెల్‌ తగ్గి రంగు మారుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే పాలు, పాల పదార్థాలు తప్పని సరి. చక్కెర, పిండి పదార్థాలు తగ్గించాలి. పీచుపదార్థాలు ఉన్న కూరలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. దంతాల ఎనామెల్‌కు నష్టం కలిగించే పుల్లటి పదార్థాలు తగ్గించాలి. ఫాస్ఫరస్‌ అధికంగా ఉండే కూల్‌డ్రింకులకు దూరంగా ఉండాలి. అత్యంత వేడి, చల్ల పదార్థాలను నివారించాలి. ఆహారం తీసుకున్న తరువాత నీటితో పుక్కిలించడం మంచిది. తప్పని సరిగా రోజుకు రెండు సార్లు దంతాలు శుభ్రం చేసుకోవాలి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-09-17T18:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising