ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జుట్టు తెల్లబడిపోతోంది.. ఏం చేయాలి?

ABN, First Publish Date - 2021-08-19T18:49:54+05:30

మధ్య వయసు దాటిన తరువాత వెంట్రుకలు నెరవడం సర్వసాధారణం. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడాన్ని ప్రీమెచ్యూర్‌ గ్రేయింగ్‌ లేదా బాలనెరుపు అంటారు. చిన్న తనంలోనే జుటు తెల్లబడడం వల్ల ఆరోగ్యానికి ఏ సమస్యా ఉండదు. కానీ ఎదుగుతున్న కొద్దీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(19-08-2021)

ప్రశ్న: నేను ఇంటర్‌ చదువుతున్నాను. బాలనెరుపు వచ్చి జుట్టు తెల్లబడిపోతోంది. ఏవైనా ఆహార నియమాలు తెలియజేయండి.


- విజయ్‌, మంచిర్యాల


డాక్టర్ సమాధానం: మధ్య వయసు దాటిన తరువాత వెంట్రుకలు నెరవడం సర్వసాధారణం. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడాన్ని ప్రీమెచ్యూర్‌ గ్రేయింగ్‌ లేదా బాలనెరుపు అంటారు. చిన్న తనంలోనే జుటు తెల్లబడడం వల్ల ఆరోగ్యానికి ఏ సమస్యా ఉండదు. కానీ ఎదుగుతున్న కొద్దీ మానసికంగా కొంత ఇబ్బంది కలుగుతుంది జన్యుపరమైన కారణాల వల్ల, ఏవైనా ఆరోగ్య సమస్యల వల్ల విటమిన్‌ బి 12, ఐరన్‌ లోపం; స్ట్రెస్‌ లేదా ఆందోళన; జుట్టుకు వాడే షాంపూలు పడకపోవడం; దగ్గర్లో ఎవరైనా ధూమపానం చేయడం.... ఇలా వివిధ కారణాల వల్ల బాలనెరుపు వచ్చే అవకాశం ఉంది. ఆహారంలో బి 12 అధికంగా ఉండే పాలు, పెరుగు, మాంసం, గుడ్లు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇనుము కోసం ఆకుకూరలు, అన్ని రకాల ఖనిజాలు పుష్కలంగా అందేలా గింజలను తినాలి. మాంసకృత్తులని మాంసం రూపంలో లేదా గుడ్లు లేదా పప్పుధాన్యాల రూపంలో ప్రతి పూటా భుజించడం వల్ల కొంత వరకు బాలనెరుపు సమస్యను అధిగమించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలితో కొంత వరకు ఈ సమస్య తీరినప్పటికీ వైద్యుల సలహాతో ఏదైనా పరిష్కారం పొందడం మంచిది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-08-19T18:49:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising