ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా అమ్మాయికి ఎస్‌ఎల్‌ఈ..

ABN, First Publish Date - 2021-08-17T21:24:47+05:30

సిస్టమిక్‌ లూపస్‌ ఎరిత్మాటోసస్‌ (ఎస్‌ఎల్‌ఈ) అనేది ఒక ఆటోఇమ్మ్యూన్‌ వ్యాధి. దీనిలో రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేస్తుంది. దీనివల్ల ప్రభావిత అవయవాలలో కణజాల నష్టం జరుగుతుంది. ఇది కీళ్ళు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(17-08-2021)

ప్రశ్న: వైద్య పరీక్షలలో మా అమ్మాయికి ఎస్‌ఎల్‌ఈ ఉందని తేలింది. ఎలాంటి ఆహార నియమాలను పాటించాలి?


- మంజుల, కరీంనగర్‌


డాక్టర్ సమాధానం: సిస్టమిక్‌ లూపస్‌ ఎరిత్మాటోసస్‌ (ఎస్‌ఎల్‌ఈ) అనేది ఒక ఆటోఇమ్మ్యూన్‌ వ్యాధి. దీనిలో రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేస్తుంది. దీనివల్ల ప్రభావిత అవయవాలలో కణజాల నష్టం జరుగుతుంది. ఇది కీళ్ళు, చర్మం, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, రక్తనాళాలను ప్రభావితం చేయవచ్చు. లూపస్‌కు చికిత్స లేదు, కానీ వైద్యుల సూచన మేరకు మందులు వాడడం, జీవనశైలి మార్పులు దానిని నియంత్రించడంలో సహాయపడతాయి. లూపస్‌ ఉన్నవారు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు పుష్కలంగా ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. ఈ వ్యాధి ఏ అవయవాల్లో అధిక ప్రభావం చూపుతుందో దానిని బట్టి ఆహార నియమాలు కూడా ఉంటాయి. కెలోరీలు, ప్రొటీన్లు మితంగా తీసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉండే చేపలు లేదా చేప నూనె సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ నియంత్రణలో ఉంటుంది. ఆలివ్‌ నూనె, బాదం, ఆక్రోట్‌ గింజలు కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు రోజూ తినాలి. అధికంగా శుద్ధి చేసిన ఆహారం, బేకరీ చిరుతిండ్లు, చక్కెర మొదలైనవి పూర్తిగా మానెయ్యాలి. ఆల్ఫా ఆల్ఫా మొలకలు, ఆ గడ్డితో చేసిన ఎలాంటి పదార్థాలకైనా దూరంగా ఉండాలి. వెల్లుల్లి కూడా మితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానెయ్యడం మంచిది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2021-08-17T21:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising