ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి సమయానికి హుషారుగా ఉండాలంటే ఎలాంటి డైట్ పాటించాలి?

ABN, First Publish Date - 2021-12-17T17:52:52+05:30

వచ్చే నెలలో మా అబ్బాయి పెళ్లి. పెళ్లి సమయానికి మా ఇంటిల్లిపాదీ హుషారుగా ఉండేందుకు ఇప్పటి నుంచే ఎలాంటి డైట్‌ పాటించాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(17-12-2021)

ప్రశ్న: వచ్చే నెలలో మా అబ్బాయి పెళ్లి. పెళ్లి సమయానికి మా ఇంటిల్లిపాదీ హుషారుగా ఉండేందుకు ఇప్పటి నుంచే ఎలాంటి డైట్‌ పాటించాలి?


-విద్యుల్లత, నరసరావుపేట


డాక్టర్ సమాధానం: ఉత్సాహంగా, హుషారుగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండడం తప్పని సరి. పెళ్లి పనుల ఒత్తిళ్లలో ఆహారవేళలు పాటించకపోతే ఆరోగ్యం పాడవుతుంది. పనులపై బయటికి వెళ్ళినప్పుడు కూడా పండ్లు, గింజలు లాంటి స్నాక్స్‌ వెంట తీసుకెళ్తే ఆకలేసినప్పుడు తినేందుకు వీలుంటుంది. రోజూ పండ్లు, కూరగాయలు ఎక్కువ మోతాదులో సలాడ్లలా తీసుకోవడం వల్ల విటమిన్స్‌, యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి ఒత్తిడి వల్ల వచ్చే అలసటను పోగొట్టేందుకు ఉపయోగపడతాయి. బయటకు వెళ్లే ముందే ఇంట్లో భోజనం చేసి వెళ్తే బయట అనారోగ్యకరమైన ఫాస్ట్‌ ఫుడ్‌ తినాల్సిన అవసరం తప్పుతుంది. షాపింగ్‌కు వెళ్ళినప్పుడు టీలు, కాఫీలు లెక్క లేకుండా తాగడం వల్ల అనవసరమైన చక్కెర, కెలోరీలు ఒంట్లో చేరతాయి. వాటికి బదులుగా నీళ్ళో, కొబ్బరినీళ్ళో తాగితే ఆరోగ్యకరం. పనులను ప్రణాళిక ప్రకారం చేసుకుంటే అనవసర ఒత్తిడి తగ్గి నిద్రకు కూడా ఇబ్బంది ఉండదు. హుషారుగా పనులు చెయ్యాలంటే నిద్రను అశ్రద్ధ చేయకూడదు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు) 

Updated Date - 2021-12-17T17:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising