ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీళ్లనొప్పులకు ఏం తినాలి?

ABN, First Publish Date - 2021-02-18T20:40:19+05:30

కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం అవసరం. కాలానుగుణంగా వచ్చే అన్ని రకాల పండ్లు, క్యారెట్‌, బీట్రూట్‌, కాప్సికం, బీన్స్‌, చిక్కుడు లాంటి రంగు రంగుల కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(17-02-2021)

ప్రశ్న: కీళ్ల నొప్పులు ఈమధ్యే మొదలయ్యాయి. వీటిని తగ్గించే ఆహార పదార్థాలు ఉన్నాయా?


- రమణి, వరంగల్‌


డాక్టర్ సమాధానం: కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం అవసరం. కాలానుగుణంగా వచ్చే అన్ని రకాల పండ్లు, క్యారెట్‌, బీట్రూట్‌, కాప్సికం, బీన్స్‌, చిక్కుడు లాంటి రంగు రంగుల కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు సలాడ్ల రూపంలోనో, కూరలుగానో రోజూ తీసుకోవాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్‌, బ్రొకొలి, ముల్లంగి లాంటి కూరలు అధికంగా తీసుకోవాలి. పసుపు, అల్లం, వెల్లుల్లి కూడా మంచివే. పాలు, పెరుగు, పనీర్‌, చీజ్‌, పలు రకాల ఆకుకూరలు, సోయా చిక్కుడు, బాదం, ఆక్రోట్‌ గింజలు మొదలైన ఆహారపదార్థాల్లో కాల్షియం సమృద్థిగా లభిస్తుంది. ఆహారంలోని కాల్షియాన్ని ఎముకలు శోషించుకోవాలంటే విటమిన్‌‘డి’ అవసరం. ఇరవై నిమిషాలు చర్మానికి ఎండ తగిలేలా గడిపితే సరి. తక్కువ కొవ్వు కలిగిన కోడి మాంసం, చేపలు వారానికి రెండుసార్లకు మించకుండా తినవచ్చు. ఒమేగా-3 అధికంగా ఉన్న చేపలు, అవిసె గింజలు, ఆక్రోట్‌ గింజలు ఎక్కువగా తీసుకోవాలి. తెల్ల అన్నం, మైదాతో చేసిన పదార్థాలు, బేకరీ ఫుడ్స్‌, వేపుళ్ళు, స్వీట్లు, పంచదార, టీ, కాఫీలను తగ్గించాలి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2021-02-18T20:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising