ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వే ప్రొటీన్‌ మంచిదేనా?

ABN, First Publish Date - 2021-11-03T19:35:27+05:30

పాలలో ఉండే ప్రొటీన్‌లో ఎనభై శాతం కేసీన్‌; ఇరవై శాతం వే ప్రొటీన్‌. పాలనుండి పనీర్‌, చీజ్‌ మొదలైన పదార్థాలను తయారుచేసినప్పుడు మిగిలే ద్రవం నుండి ఈ వే ప్రొటీన్‌ను తయారుచేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(03-11-2021)

ప్రశ్న: పాలల్లో ఉండే వే ప్రొటీన్‌ వల్ల ఉపయోగాలేమిటి? అందరూ తీసుకోవచ్చా?


- సురేశ్‌, మెదక్‌


డాక్టర్ సమాధానం: పాలలో ఉండే ప్రొటీన్‌లో ఎనభై శాతం కేసీన్‌; ఇరవై శాతం వే ప్రొటీన్‌. పాలనుండి పనీర్‌, చీజ్‌ మొదలైన పదార్థాలను తయారుచేసినప్పుడు మిగిలే ద్రవం నుండి ఈ వే ప్రొటీన్‌ను తయారుచేస్తారు. విశ్వాసకరమైన బ్రాండ్ల నుండి తీసే కొన్ని వే ప్రొటీన్‌లు మాత్రమే మంచి నాణ్యతను కలిగి ఉంటాయి. తేలికగా అరగడం, శరీరంలోకి శోషించుకోబడటం లాంటి లక్షణాల వల్ల వే ప్రొటీన్‌ శక్తినిచ్చేందుకు, కండరాల బలానికి ఉపయోగపడుతుంది. పాలనుండే వచ్చినప్పటికీ తయారీ విధానాల్లో మార్పులను బట్టి మార్కెట్లో దొరికే వే ప్రొటీన్ల నాణ్యత మారుతుంటుంది. మామూలు పోషకాహారం ద్వారా పూర్తి స్థాయిలో ప్రొటీన్‌ అందనివారు, ఏదైనా అనారోగ్యం వల్ల ప్రొటీన్‌, కెలోరీలు అధికంగా తీసుకోవలసిన వారు, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే ఆటగాళ్లు, వ్యాయామం చేసేవారు మొదలైన వారికి సమతుల్య పోషకాహారంతో పాటుగా వే ప్రొటీన్‌ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇలాంటి సప్లిమెంట్లు ఏవైనా మొదలుపెట్టేముందు వాటి ఆవశ్యకతను వైద్యులు లేదా పోషకాహార నిపుణులను సంప్రదించి తెలుసుకోవడం మేలు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-11-03T19:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising