ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సగ్గుబియ్యం అందరూ తినొచ్చా.. తింటే ఏం ఉపయోగం?

ABN, First Publish Date - 2021-12-11T23:12:34+05:30

కర్ర పెండలం అనే దుంపలో ఉండే పిండి పదార్థం నుంచి సగ్గు బియ్యం తయారు చేస్తారు. ఇది పూర్తిగా పిండిపదార్థంతో తయారైనది కాబట్టి వేరే పోషకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండవు. కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(11-12-2021)

ప్రశ్న: సగ్గుబియ్యంలో ఎటువంటి పోషకాలు ఉంటాయి? అందరూ తినొచ్చా?


- శైలజ, మహబూబ్‌నగర్‌


డాక్టర్ సమాధానం: కర్ర పెండలం అనే దుంపలో ఉండే పిండి పదార్థం నుంచి సగ్గు బియ్యం తయారు చేస్తారు. ఇది పూర్తిగా పిండిపదార్థంతో తయారైనది కాబట్టి వేరే పోషకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండవు. కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు ఏవీ ఉండవు. అంతా పిండి పదార్థమే కాబట్టి తేలికగా అరిగి వెంటనే శక్తి ఇస్తుంది. జ్వరం, ఏదైనా అనారోగ్యం లాంటివి ఉన్నప్పుడు తేలికపాటి ఆహారం తీసుకోవాల్సిన సమయంలో సగ్గుబియ్యం ఉపయోగపడుతుంది. సగ్గు బియ్యాన్ని ఉడికించినప్పుడు ఇది ఎక్కువ మొత్తంలో నీటిని పీల్చుకుంటుంది. శక్తితో పాటు నీటిని కుండా అందించేందుకు సగ్గుబియ్యం జావ పనికొస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలను వెంటనే పెంచే గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ అధికంగా ఉండడం వల్ల మధుమేహం ఉన్న వారికి ఇది మంచి ఆహారం కాదు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.coomకు పంపవచ్చు)

Updated Date - 2021-12-11T23:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising