ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నానికి ప్రత్యామ్నాయంగా వాటిని తింటారు..

ABN, First Publish Date - 2021-04-23T19:44:06+05:30

మరమరాలు బియ్యం నుంచి తయారవుతాయి. అందువల్ల బియ్యంలో ఉండే పోషకాలే వీటిలోనూ ఉంటాయి. వీటిని నిల్వ ఉంచడం సులభం. తేలికగా అరుగుతాయి. అన్ని వయసుల వారికీ అనుకూలంగా ఉండడం వల్ల మరమరాలు చిరుతిండిగా, ఉదయం అల్పాహారంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(23-04-2021)

ప్రశ్న: మరమరాల్లో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి? 


- రాధిక, విశాఖపట్నం


డాక్టర్ సమాధానం: మరమరాలు బియ్యం నుంచి తయారవుతాయి. అందువల్ల బియ్యంలో ఉండే పోషకాలే వీటిలోనూ ఉంటాయి. వీటిని నిల్వ ఉంచడం సులభం. తేలికగా అరుగుతాయి. అన్ని వయసుల వారికీ అనుకూలంగా ఉండడం వల్ల మరమరాలు చిరుతిండిగా, ఉదయం అల్పాహారంగా, కొన్ని ప్రాంతాల్లో అన్నానికి ప్రత్యామ్నాయంగా కూడా వాడతారు. వంద గ్రాముల మరమరాల్లో నాలుగు వందల కెలోరీలు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగం పిండి పదార్థాలే కాబట్టి అన్నం మితంగా తీసుకోవలసిన మధుమేహులు మరమరాలను తక్కువగానే తీసుకోవాలి. సాధారణంగా మనకు లభించే మరమరాలు విటమిన్లు, ఖనిజాలు కలిపినవి కాదు కాబట్టి వీటి నుంచి ఎక్కువగా పోషకాలు అందవు. అయితే  వీటిలోకొవ్వులు తక్కువ. కొద్దిగా తీసుకున్నా పరిమాణం ఎక్కువగా అనిపించడం వల్ల మరమరాలను చిరుతిండిగా తీసుకుంటే నష్టమేమి ఉండదు. మరమరాలకు చక్కర పాకం, బెల్లం తదితర అధిక కెలోరీల పదార్థాలను చేర్చి చేసే చిరుతిళ్ళకు మాత్రం దూరంగా ఉండడమే మంచిది.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-04-23T19:44:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising